Tanisidi nimka navi tadavaguve vaani

తనిసితి నిఁక నవి తడవకువే వాని
Language

(॥పల్లవి॥)
తనిసితి నిఁక నవి తడవకువే వాని-
మనసు దెలియఁ గంతుమాయలయినఁ జాలవు

(॥తని॥)
చిత్తరువుమాఁకులకు జిగురులు గలుగునా
హత్తినతనవలపూ నటువంటిది
పొత్తుల నటుండనీవే పొందగుపతిగుణాలు
యిత్తల నే నెంచేనంటే యిసుమైనఁ జాలదు

(॥తని॥)
నెమ్మి నెండమావులలో నినుపునీరుండునటే
అమ్మలాల తనబాస లటువంటివే
కమ్మర నింకా నేవే కాంతునిమోవిమీఁద
సొమ్ములవి యెంతమంటెఁ జుక్కలైన జాలవు

(॥తని॥)
కందువైనకతలకుఁ గాళ్లు గలుగునటే
అందమైనతనసుద్దు లటువంటివే
పొందినశ్రీవేంకటేశు భోగము చెప్పఁబోతే
యెందును రేలు బగళ్లు నెన్నియైనఁ జాలవు

(||pallavi||)
tanisidi nim̐ka navi taḍavaguve vāni-
manasu dĕliyam̐ gaṁtumāyalayinam̐ jālavu

(||tani||)
sittaruvumām̐kulagu jigurulu galugunā
hattinadanavalabū naḍuvaṁṭidi
pŏttula naḍuṁḍanīve pŏṁdagubadiguṇālu
yittala ne nĕṁchenaṁṭe yisumainam̐ jāladu

(||tani||)
nĕmmi nĕṁḍamāvulalo ninubunīruṁḍunaḍe
ammalāla tanabāsa laḍuvaṁṭive
kammara niṁkā neve kāṁtunimovimīm̐da
sŏmmulavi yĕṁtamaṁṭĕm̐ jukkalaina jālavu

(||tani||)
kaṁduvainagadalagum̐ gāḽlu galugunaḍe
aṁdamainadanasuddu laḍuvaṁṭive
pŏṁdinaśhrīveṁkaḍeśhu bhogamu sĕppam̐bode
yĕṁdunu relu bagaḽlu nĕnniyainam̐ jālavu