తనసొమ్మై వున్నదాన తమకమేలే
(॥పల్లవి॥)
తనసొమ్మై వున్నదాన తమకమేలే
ననుపైనదే చాలు నగితి నే ననవే
(॥తన॥)
తేనలమాఁటలు నాఁడె తీపులాయ తనవల్ల
కానివొట్లతో నేఁడు కారములాయ
వూని యింక నేమన్నా నొగరౌనో చేఁదౌనో
మోనాన నుండుటే మేలు మొక్కితి నే ననవే
(॥తన॥)
అల్లనాఁటితనచూవు లుప్పటికి నీడలాయ
యిల్లిదె తన్నుఁ బాయఁగ యెండలాయను
వెల్లిగా నిఁక నేమన్నా వేఁడౌనొ వాండ్లౌనో
వెల్లివిరి సేయనేల వెరగైతి ననవే
(॥తన॥)
పొందినపొందులు నాఁడె పూఁపలాయఁబిందెలాయ
చెంది నేఁడె దోరలాయ చేరికూడఁగా
అందిన శ్రీ వేంకటేశుఁ డంటితేనె పండ్లాయ
మందెమేళ మింతచాలు మరవకు మనవే
(||pallavi||)
tanasŏmmai vunnadāna tamagamele
nanubainade sālu nagidi ne nanave
(||tana||)
tenalamām̐ṭalu nām̐ḍĕ tībulāya tanavalla
kānivŏṭlado nem̐ḍu kāramulāya
vūni yiṁka nemannā nŏgarauno sem̐dauno
monāna nuṁḍuḍe melu mŏkkidi ne nanave
(||tana||)
allanām̐ṭidanasūvu luppaḍigi nīḍalāya
yillidĕ tannum̐ bāyam̐ga yĕṁḍalāyanu
vĕlligā nim̐ka nemannā vem̐ḍaunŏ vāṁḍlauno
vĕlliviri seyanela vĕragaidi nanave
(||tana||)
pŏṁdinabŏṁdulu nām̐ḍĕ pūm̐palāyam̐biṁdĕlāya
sĕṁdi nem̐ḍĕ doralāya serigūḍam̐gā
aṁdina śhrī veṁkaḍeśhum̐ ḍaṁṭidenĕ paṁḍlāya
maṁdĕmeḽa miṁtasālu maravagu manave