Tanasedi dimkanu dharmamu punyamu

తనచేతి దిఁకను ధర్మము పుణ్యము
Language

(॥పల్లవి॥)
తనచేతి దిఁకను ధర్మము పుణ్యము
చొనిపి యింకాఁ దన్ను సొలసేఁటిదేఁటిదే

(॥తన॥)
ములువాఁడికొనగోరిమొనలు వాఁడి
కలయనితనతోడికాఁకలు వేఁడి
అలసితి రెంటివల్లానప్పుడే నేను
యెలమి నింకాఁ దనతో నేఁటిమాఁటలే

(॥తన॥)
సారపుఁబయ్యదలోనిచన్నులు గట్టి
సారెకు నాడేసరసములు వెట్టి
అరితేరె నిందునందు నందరిలోన
మారుకొని యింకాను మరి యేఁటిపొందులే

(॥తన॥)
నెమ్మి వీడినతురుమునెరులు చిక్కు
కమ్మరఁ గూడినయట్టి కాఁగిలిచొక్కు
నమ్మించి శ్రీవేంకటేశుఁడు నన్నేలెను
సమ్మతిఁ దనకు నాకు సరి నేఁటిసిగ్గులు

(||pallavi||)
tanasedi dim̐kanu dharmamu puṇyamu
sŏnibi yiṁkām̐ dannu sŏlasem̐ṭidem̐ṭide

(||tana||)
muluvām̐ḍigŏnagorimŏnalu vām̐ḍi
kalayanidanadoḍigām̐kalu vem̐ḍi
alasidi rĕṁṭivallānappuḍe nenu
yĕlami niṁkām̐ danado nem̐ṭimām̐ṭale

(||tana||)
sārabum̐bayyadalonisannulu gaṭṭi
sārĕgu nāḍesarasamulu vĕṭṭi
ariderĕ niṁdunaṁdu naṁdarilona
mārugŏni yiṁkānu mari yem̐ṭibŏṁdule

(||tana||)
nĕmmi vīḍinadurumunĕrulu sikku
kammaram̐ gūḍinayaṭṭi kām̐gilisŏkku
nammiṁchi śhrīveṁkaḍeśhum̐ḍu nannelĕnu
sammadim̐ danagu nāgu sari nem̐ṭisiggulu