తనంటిదాననా తరుణి నింతే నేను
(॥పల్లవి॥)
తనంటిదాననా తరుణి నింతే నేను
పనివూని నాతో నేల పంతములాడీనే
(॥తనం॥)
చిగురువంటిది మోవి చెప్పి చూపె నంటిమా
నగవు వెన్నెలలోని నామువంటిది
మొగులువంటిది కొప్పు ముడుచుకున్నారము
జిగిమించి మమ్ము నేల చెనకీనే తాను
(॥తనం॥)
తలపోయ మా మొగము తామరపూవువంటిది
బలుచన్ను లివి నిమ్మపండ్లవంటివి
తొలుతనే యివె మా చేతులు తీఁగెలవంటివి
చలముల మాతో నేల సాములు సేసీనే
(॥తనం॥)
రయమున మా తొడ లరఁటి కంభాలవంటివి
బయలువంటిదివో చెప్పఁగ నడుము
నియతాన మన్నించి నేఁడు శ్రీవేంకటేశుఁడు
దయతో నన్నేలె నేల తమకించీనే
(||pallavi||)
tanaṁṭidānanā taruṇi niṁte nenu
panivūni nādo nela paṁtamulāḍīne
(||tanaṁ||)
siguruvaṁṭidi movi sĕppi sūbĕ naṁṭimā
nagavu vĕnnĕlaloni nāmuvaṁṭidi
mŏguluvaṁṭidi kŏppu muḍusugunnāramu
jigimiṁchi mammu nela sĕnagīne tānu
(||tanaṁ||)
talaboya mā mŏgamu tāmarabūvuvaṁṭidi
balusannu livi nimmabaṁḍlavaṁṭivi
tŏludane yivĕ mā sedulu tīm̐gĕlavaṁṭivi
salamula mādo nela sāmulu sesīne
(||tanaṁ||)
rayamuna mā tŏḍa laram̐ṭi kaṁbhālavaṁṭivi
bayaluvaṁṭidivo sĕppam̐ga naḍumu
niyadāna manniṁchi nem̐ḍu śhrīveṁkaḍeśhum̐ḍu
dayado nannelĕ nela tamagiṁchīne