Tanagu naagunum bodu tarunu lemdarunnaanu

తనకు నాకునుఁ బోదు తరుణు లెందరున్నాను
Language

(॥పల్లవి॥)
తనకు నాకునుఁ బోదు తరుణు లెందరున్నాను
యెనసి నా విన్నపము లిటు చేకొమ్మనవే

(॥తన॥)
తా నాతో నాడినమాఁట తలఁచుకొమ్మనవే
ఆనవెట్టి చెలినైనా నడుగుమని యనవే
మోనాన వరుసదినములు యెంచుకొమ్మనవే
తానిఁక నాపై దయదలఁచుమని యనవే

(॥తన॥)
వాకిట నేవ్రాసిన వ్రాలు చూచుకొమ్మనవే
కాక తన నామేనరికము నడపుమనవే
చేకొన్న నా వుంగరము చేతఁ జూచుకొమ్మనవే
యేకాలము నన్ను నిఁక నెడయకు మనవే

(॥తన॥)
నాయింటి వంక చూచి మనసు గరఁగుమనవే
సేయరాని నాసేవలు చిత్తమెరుఁగుననవే
యీయెడ శ్రీవేంకటేశుఁ డింతలో వచ్చి నన్నేలె
పాయక యెప్పడును నాబత్తి చేకొమ్మనవే

(||pallavi||)
tanagu nāgunum̐ bodu taruṇu lĕṁdarunnānu
yĕnasi nā vinnabamu liḍu segŏmmanave

(||tana||)
tā nādo nāḍinamām̐ṭa talam̐sugŏmmanave
ānavĕṭṭi sĕlinainā naḍugumani yanave
monāna varusadinamulu yĕṁchugŏmmanave
tānim̐ka nābai dayadalam̐sumani yanave

(||tana||)
vāgiḍa nevrāsina vrālu sūsugŏmmanave
kāga tana nāmenarigamu naḍabumanave
segŏnna nā vuṁgaramu sedam̐ jūsugŏmmanave
yegālamu nannu nim̐ka nĕḍayagu manave

(||tana||)
nāyiṁṭi vaṁka sūsi manasu garam̐gumanave
seyarāni nāsevalu sittamĕrum̐gunanave
yīyĕḍa śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalo vachchi nannelĕ
pāyaga yĕppaḍunu nābatti segŏmmanave