Tanagu naagum banulu taarugaanimchaga teera

తనకు నాకుఁ బనులు తారుకాణించక తీర
Language

(॥పల్లవి॥)
తనకు నాకుఁ బనులు తారుకాణించక తీర-
దెనలేని వొడఁబాట్లు యిఁకనేమి చెప్పేరే

(॥తన॥)
మనసులొకోపమెల్ల మాటలాడక తీరదు
తనువుపై పనులెల్ల తగఁ గూడక తీరదు
అనుమానించినచోట ఆనవెట్టక తీరదు
యెనలేనితనద్దు లిఁకనేమి చెప్పేరే

(॥తన॥)
సరిబేసిపంతాలు జగడించక తీరదు
మరుతంత్రములమెండు మతి చోక్కక తీరదు
సరుగ మోఁచినచోట సాదించక తీరదు
యెరవు లాతనిగుణా లిఓకనేమి చెప్పేరే

(॥తన॥)
కోసరి దూరేచోట కుస్తరించక తీరదు
పోసఁగినరతివేళ బుజ్జగించక తీరదు
అసుడై శ్రీవేంకటేశుఁ డంత నేసి నన్నుఁ గూడె
యెసగె నాతని చేఁత లిఁకనేమి చెప్పేరే

(||pallavi||)
tanagu nāgum̐ banulu tārugāṇiṁchaga tīra-
dĕnaleni vŏḍam̐bāṭlu yim̐kanemi sĕppere

(||tana||)
manasulŏgobamĕlla māḍalāḍaga tīradu
tanuvubai panulĕlla tagam̐ gūḍaga tīradu
anumāniṁchinasoḍa ānavĕṭṭaga tīradu
yĕnalenidanaddu lim̐kanemi sĕppere

(||tana||)
saribesibaṁtālu jagaḍiṁchaga tīradu
marudaṁtramulamĕṁḍu madi sokkaga tīradu
saruga mom̐sinasoḍa sādiṁchaga tīradu
yĕravu lādaniguṇā lioganemi sĕppere

(||tana||)
kosari dūresoḍa kustariṁchaga tīradu
posam̐ginaradiveḽa bujjagiṁchaga tīradu
asuḍai śhrīveṁkaḍeśhum̐ ḍaṁta nesi nannum̐ gūḍĕ
yĕsagĕ nādani sem̐ta lim̐kanemi sĕppere