Tanage telusune taṟavaadi maamtalu

తనకే తెలుసునే తఱవాతి మాఁటలు
Language

(॥పల్లవి॥)
తనకే తెలుసునే తఱవాతి మాఁటలు
చనవరినై యుంటే జాణతన మవుఁగా

(॥తన॥)
రచ్చలఁ దన్నుఁ బొగడిరవకత్తె నేనైతినే
యిచ్చకమే ఆడిమాడి ఇట్లయితినే
పచ్చిగాఁ గొసరితేనే పంతగత్తె నైతినే
నెచ్చెలుల వలె నుంటే నేరమేమీ గాదుగా

(॥తన॥)
తనుఁ గొంగుపట్టీతీసి దంటాదాన నైతినే
యెనసి మొక్కులు మొక్కి యిట్లయితినే
కనువిచ్చి చూచితేనే గట్టువాయ నైతినే
తనయంత నేనుంటే తప్పులేమీ లేవుగా

(॥తన॥)
అంది యిట్టె కాఁగిలించి ఆసకత్తె నైతినే
యిందుకు రమ్మనఁగానే యిట్టయితినే
ముందె శ్రీవేంకటశేశుఁడు మోహమున నన్నుఁ గూడె
యిందరివలెనే వుంటే యొగసక్కే లవుఁగా

(||pallavi||)
tanage tĕlusune taṟavādi mām̐ṭalu
sanavarinai yuṁṭe jāṇadana mavum̐gā

(||tana||)
rachchalam̐ dannum̐ bŏgaḍiravagattĕ nenaidine
yichchagame āḍimāḍi iṭlayidine
pachchigām̐ gŏsaridene paṁtagattĕ naidine
nĕchchĕlula valĕ nuṁṭe neramemī gādugā

(||tana||)
tanum̐ gŏṁgubaṭṭīdīsi daṁṭādāna naidine
yĕnasi mŏkkulu mŏkki yiṭlayidine
kanuvichchi sūsidene gaṭṭuvāya naidine
tanayaṁta nenuṁṭe tappulemī levugā

(||tana||)
aṁdi yiṭṭĕ kām̐giliṁchi āsagattĕ naidine
yiṁdugu rammanam̐gāne yiṭṭayidine
muṁdĕ śhrīveṁkaḍaśheśhum̐ḍu mohamuna nannum̐ gūḍĕ
yiṁdarivalĕne vuṁṭe yŏgasakke lavum̐gā