తనకంటె నేరుతుము తరవాతి పనులకు
(॥పల్లవి॥)
తనకంటె నేరుతుము తరవాతి పనులకు
చెనకెఁ జిగురుఁగొమ్మె చేఁగయయ్యీ ననరే
(॥తన॥)
చెప్పఁబోతే నెన్నియైనా చిగిరించీ మాటలు
వొప్పుగ మోనముతోడనుండుమనవే
అప్పటనుండి వింటి సవె చాలు నేమన్నా
పిప్పి గట్టీ నీరుదియ్యఁ బేనువచ్చీ ననవే
(॥తన॥)
చేరి పెంచఁబోతేను చెంగలించీ వగవులు
వోరుచుక గుట్టుసేసుకుండుమనవే
ఆరితేర కనుఁగొంటి నవె చాలు నిఁకమీఁద
గోరగీరితేమఱి గొప్పయేరౌ ననవే
(॥తన॥)
వొత్తి కాఁగిలించుకొంటే పూరీని చెమటలు
వుత్తలపడక కొంత వుండుమనవే
ఇత్తల శ్రీవేంకటేశుఁ డిట్టె తా నన్నుఁగూడె
కొత్తమొలకచన్నులే కొండలాయ ననవే
(||pallavi||)
tanagaṁṭĕ nerudumu taravādi panulagu
sĕnagĕm̐ jigurum̐gŏmmĕ sem̐gayayyī nanare
(||tana||)
sĕppam̐bode nĕnniyainā sigiriṁchī māḍalu
vŏppuga monamudoḍanuṁḍumanave
appaḍanuṁḍi viṁṭi savĕ sālu nemannā
pippi gaṭṭī nīrudiyyam̐ benuvachchī nanave
(||tana||)
seri pĕṁcham̐bodenu sĕṁgaliṁchī vagavulu
vorusuga guṭṭusesuguṁḍumanave
āridera kanum̐gŏṁṭi navĕ sālu nim̐kamīm̐da
goragīridemaṟi gŏppayerau nanave
(||tana||)
vŏtti kām̐giliṁchugŏṁṭe pūrīni sĕmaḍalu
vuttalabaḍaga kŏṁta vuṁḍumanave
ittala śhrīveṁkaḍeśhum̐ ḍiṭṭĕ tā nannum̐gūḍĕ
kŏttamŏlagasannule kŏṁḍalāya nanave