తన నేరుచుబుద్ది తానే యెఱుఁగుఁగాక
(॥పల్లవి॥)
తన నేరుచుబుద్ది తానే యెఱుఁగుఁగాక
అని యనిపించుకొనుటంత నాకుఁ జెల్లునా
(॥తన॥)
కప్పురపు నోటిమాటే కడునిఁ పైవుండుఁగాక
చప్పనిమానోరిమాట చవులయ్యీనా
యెప్పటిమోహపుకాంత యేమనినా వినుఁగాక
అప్పసమై వున్నదాన నంత నాకుఁ జెల్లునా
(॥తన॥)
వుంగరపు వేలిసన్న లోడఁబాటై వుండుఁగాక
సంగడి మాచేసన్న సంగతియౌనా
చెంగట నాకె యేపచ్చి సేసినా నమరుఁగాక
అంగము నే గొర నంట నంత నాకుఁ జెల్లునా
(॥తన॥)
కాటుకవెట్టినకంట కన్నులార్చఁజెల్లుఁగాక
తేట తెల్లని మాచూపు తేఁకువయ్యీనా
యేఁటికని శ్రీవేంకటేశుఁడు గూడెఁగాక
ఆఁటదానఁ దన్ను దూర నంత నాకుఁజెల్లునా
(||pallavi||)
tana nerusubuddi tāne yĕṟum̐gum̐gāga
ani yanibiṁchugŏnuḍaṁta nāgum̐ jĕllunā
(||tana||)
kappurabu noḍimāḍe kaḍunim̐ paivuṁḍum̐gāga
sappanimānorimāḍa savulayyīnā
yĕppaḍimohabugāṁta yemaninā vinum̐gāga
appasamai vunnadāna naṁta nāgum̐ jĕllunā
(||tana||)
vuṁgarabu velisanna loḍam̐bāḍai vuṁḍum̐gāga
saṁgaḍi māsesanna saṁgadiyaunā
sĕṁgaḍa nāgĕ yebachchi sesinā namarum̐gāga
aṁgamu ne gŏra naṁṭa naṁta nāgum̐ jĕllunā
(||tana||)
kāḍugavĕṭṭinagaṁṭa kannulārsam̐jĕllum̐gāga
teḍa tĕllani māsūbu tem̐kuvayyīnā
yem̐ṭigani śhrīveṁkaḍeśhum̐ḍu gūḍĕm̐gāga
ām̐ṭadānam̐ dannu dūra naṁta nāgum̐jĕllunā