Tana meludaananani talampunam bettumanu

తన మేలుదాననని తలఁపునఁ బెట్టుమను
Language

(॥పల్లవి॥)
తన మేలుదాననని తలఁపునఁ బెట్టుమను
వినయముతోఁ జెలి విన్నవించి రావె

(॥తన॥)
చిత్తమున నెట్టుండెనో చిమ్మితిఁ గొనగోరను
కొత్త సతుల సుద్దుల కోరి చెప్పఁగా
వొత్తి మాఁటలాడితి వొద్ద నందరు నుండఁగా
తత్తరుపుఁ గాంతలను తప్పక చూడఁగను

(॥తన॥)
కోపగించఁడుగదా గొణఁగుతాఁ దిట్టితి
రాఁపుల సతులతో సరసమాడఁగా
కాఁపురము సేయుమని గయ్యాళించి పెనఁగితి
పైపై దిమ్మరితనాలపడఁతుల నంటఁగా

(॥తన॥)
సంతోసించుకొనెనో సాగిలి నే మొక్కితి
చింతదీర నామీఁదనే సేస చల్లఁగా
ఇంతలో శ్రీవేంకటేశుఁ డేలఁగా దేవులనైతి
మంతనాన నన్నే కడు మన్నించఁగాను

(||pallavi||)
tana meludānanani talam̐punam̐ bĕṭṭumanu
vinayamudom̐ jĕli vinnaviṁchi rāvĕ

(||tana||)
sittamuna nĕṭṭuṁḍĕno simmidim̐ gŏnagoranu
kŏtta sadula suddula kori sĕppam̐gā
vŏtti mām̐ṭalāḍidi vŏdda naṁdaru nuṁḍam̐gā
tattarubum̐ gāṁtalanu tappaga sūḍam̐ganu

(||tana||)
kobagiṁcham̐ḍugadā gŏṇam̐gudām̐ diṭṭidi
rām̐pula sadulado sarasamāḍam̐gā
kām̐puramu seyumani gayyāḽiṁchi pĕnam̐gidi
paibai dimmaridanālabaḍam̐tula naṁṭam̐gā

(||tana||)
saṁtosiṁchugŏnĕno sāgili ne mŏkkidi
siṁtadīra nāmīm̐dane sesa sallam̐gā
iṁtalo śhrīveṁkaḍeśhum̐ ḍelam̐gā devulanaidi
maṁtanāna nanne kaḍu manniṁcham̐gānu