Tana koga simta naa talampadi gaadugaani

తన కొక చింత నా తలఁపది గాదుగాని
Language

(॥పల్లవి॥)
తన కొక చింత నా తలఁపది గాదుగాని
కనలి సవతులచే గాసిఁబడ నోపనే

(॥తన॥)
దప్పిదేరే మోముతోడ తలవంచుకున్న నాకు
కప్పురమిచ్చి యీతడు కళరేఁచీనే
అప్పటిఁ బానుపుమీఁద నసురుసురనఁగాను
చిప్పిల మర్మములంటి సిగ్గువుట్టించీనే

(॥తన॥)
పట్టిన చలముతోడ పంతముతో నున్న నన్ను
బట్ట బయలు మాఁటాడి పలికించీనే
దిట్టతనము సేసుక తెరవేసుకుండఁగాను
చుట్టరికాలు నెరపి చొక్కించవచ్చీనే

(॥తన॥)
యెవ్వరి ననఁగలేక నివ్వెరగై నుండగాను
ఇవ్వల శ్రీవేంకటేశుఁ డిటు గూడెనే
నవ్వులకు నే నిటు సన్నలు సేసి మొక్కఁగాను
పువ్వుల వేయుచుఁ గడు పొందెలెల్లా జేసీనే

(||pallavi||)
tana kŏga siṁta nā talam̐padi gādugāni
kanali savadulase gāsim̐baḍa nobane

(||tana||)
dappidere momudoḍa talavaṁchugunna nāgu
kappuramichchi yīdaḍu kaḽarem̐sīne
appaḍim̐ bānubumīm̐da nasurusuranam̐gānu
sippila marmamulaṁṭi sigguvuṭṭiṁchīne

(||tana||)
paṭṭina salamudoḍa paṁtamudo nunna nannu
baṭṭa bayalu mām̐ṭāḍi paligiṁchīne
diṭṭadanamu sesuga tĕravesuguṁḍam̐gānu
suṭṭarigālu nĕrabi sŏkkiṁchavachchīne

(||tana||)
yĕvvari nanam̐galega nivvĕragai nuṁḍagānu
ivvala śhrīveṁkaḍeśhum̐ ḍiḍu gūḍĕne
navvulagu ne niḍu sannalu sesi mŏkkam̐gānu
puvvula veyusum̐ gaḍu pŏṁdĕlĕllā jesīne