తమకించి వట్టి జోలి దవ్వేవుగాక
(॥పల్లవి॥)
తమకించి వట్టి జోలి దవ్వేవుగాక
జమళి నాతఁడు నాకే సతమైయున్నాఁడు
(॥తమ॥)
కొలువులోనుండి పతిఁ గూరిమి గొసరుకొంటా
కలికితనాల నెంత కరఁగించేవే
యెలయింపు సేఁతలు నీ వెంత పచరించినాను
చెలఁగి నీతో పొందులు సేయనిచ్చేనా
(॥తమ॥)
వీడెము పుక్కిటనించి వికవిక నవ్వుకొంటా
వాడికతనాల నెంత వలపించేవే
వేడుకతో నీవెంత వేళ గాచుకుండినాను
యీడు జోడై యతని నీయింటికి రానిచ్చేనా
(॥తమ॥)
అద్దపుఁజెక్కులు చూపి ఆసలు వుట్టించుకొంటా
సుద్దులెల్లాఁ జెప్పి యఁత చొక్కించేవే
అద్దో శ్రీవేంకటేశుఁ డప్పుడే నా సొమ్మ్తెనాఁడు
తిద్దుకొంటి యతని నీ దిక్కు చూడనిచ్చేనా
(||pallavi||)
tamagiṁchi vaṭṭi joli davvevugāga
jamaḽi nādam̐ḍu nāge sadamaiyunnām̐ḍu
(||tama||)
kŏluvulonuṁḍi padim̐ gūrimi gŏsarugŏṁṭā
kaligidanāla nĕṁta karam̐giṁcheve
yĕlayiṁpu sem̐talu nī vĕṁta pasariṁchinānu
sĕlam̐gi nīdo pŏṁdulu seyanichchenā
(||tama||)
vīḍĕmu pukkiḍaniṁchi vigaviga navvugŏṁṭā
vāḍigadanāla nĕṁta valabiṁcheve
veḍugado nīvĕṁta veḽa gāsuguṁḍinānu
yīḍu joḍai yadani nīyiṁṭigi rānichchenā
(||tama||)
addabum̐jĕkkulu sūbi āsalu vuṭṭiṁchugŏṁṭā
suddulĕllām̐ jĕppi yam̐ta sŏkkiṁcheve
addo śhrīveṁkaḍeśhum̐ ḍappuḍe nā sŏmmtĕnām̐ḍu
tiddugŏṁṭi yadani nī dikku sūḍanichchenā