తమక మాపగరాదు తలఁపు నిలుపఁగరాదు
(॥పల్లవి॥)
తమక మాపగరాదు తలఁపు నిలుపఁగరాదు
కొమరె పాయపు వలపు గుబ్బతిలఁ దొడఁగె
(॥తమ॥)
పిలుతునా యతని నేఁ బేరుకొని యొకమాఁటు
సొలతునా కొనగోరు సోఁకనొక్కి
తెలుతునా తనమనసు తేరకొన మాటాడి
యెలమి నాకోరికలు యీడేరు టెపుడే
(॥తమ॥)
వత్తునా నీవెంట వరుస నాతనిఁ జూడ
తెత్తునా ఇంటికిని తెలిపి చెప్పి
ఇత్తునా వీడెంబు యెదురుకొని చేతికిని
హత్తి యేమనునొకో యతఁడు నా యెడకు
(॥తమ॥)
వంతునా తనమీఁద వడిగొన్న మోహంబు
నింతునా రతిఁగూడి నేర్పులెల్లా
యింతలో శ్రీ వేంకటేశుఁ డిదె నను నేలె
సంతసపుఁ గోరికలు జంటలయి పెరిగె
(||pallavi||)
tamaga mābagarādu talam̐pu nilubam̐garādu
kŏmarĕ pāyabu valabu gubbadilam̐ dŏḍam̐gĕ
(||tama||)
piludunā yadani nem̐ berugŏni yŏgamām̐ṭu
sŏladunā kŏnagoru som̐kanŏkki
tĕludunā tanamanasu teragŏna māḍāḍi
yĕlami nāgorigalu yīḍeru ṭĕbuḍe
(||tama||)
vattunā nīvĕṁṭa varusa nādanim̐ jūḍa
tĕttunā iṁṭigini tĕlibi sĕppi
ittunā vīḍĕṁbu yĕdurugŏni sedigini
hatti yemanunŏgo yadam̐ḍu nā yĕḍagu
(||tama||)
vaṁtunā tanamīm̐da vaḍigŏnna mohaṁbu
niṁtunā radim̐gūḍi nerbulĕllā
yiṁtalo śhrī veṁkaḍeśhum̐ ḍidĕ nanu nelĕ
saṁtasabum̐ gorigalu jaṁṭalayi pĕrigĕ