తమ జాడలేల మాను తతు లొనగూడితే
(॥పల్లవి॥)
తమ జాడలేల మాను తతు లొనగూడితే
మమకారములు సేసి మరిగేముగాక
(॥తమ॥)
వెలయఁగ మదనునివింటినారిఁ దగిలితే
కలువ పువ్వులేకావా కాఁడిపారేవి
అలరి మిక్కిలి విరహపువేళ వచ్చితేను
చిలుకపలుకులే కావా చిమ్మిరేఁచేవి
(॥తమ॥)
లావుగా వసంతకాలము లెదిరించితేను
కోవిలకూఁతలే కావా గురిదాఁకేవి
వావి గలపినచోట వలపులగ్గలమైతే
చేవైనమనసే కాదా చింతసేసేది
(॥తమ॥)
సటలకలగినాను చెంద్రోదయమయితే
పటికపురాయే కాదా బాద పెట్టేది
యిటు శ్రీవేంకటేశుఁడు యేలినాడు నన్ను నేఁడు
అటు చల్లగాలే కాదా అలపార్చేది
(||pallavi||)
tama jāḍalela mānu tadu lŏnagūḍide
mamagāramulu sesi marigemugāga
(||tama||)
vĕlayam̐ga madanuniviṁṭinārim̐ dagilide
kaluva puvvulegāvā kām̐ḍibārevi
alari mikkili virahabuveḽa vachchidenu
silugabalugule kāvā simmirem̐sevi
(||tama||)
lāvugā vasaṁtagālamu lĕdiriṁchidenu
kovilagūm̐tale kāvā guridām̐kevi
vāvi galabinasoḍa valabulaggalamaide
sevainamanase kādā siṁtasesedi
(||tama||)
saḍalagalaginānu sĕṁdrodayamayide
paḍigaburāye kādā bāda pĕṭṭedi
yiḍu śhrīveṁkaḍeśhum̐ḍu yelināḍu nannu nem̐ḍu
aḍu sallagāle kādā alabārsedi