Tam tana namtana taalamlo

తం తన నంతన తాళంలో
Year
Language

పల్లవి:

తననం...తననం...తననం...తననం..త...
ఆ....ఆ....ఆ...ఆ...ఆ...ఆ...ఆ..ఆ..
తం...తననం..తననం...తననం...తననం...
తం తన నంతన తాళంలో.. రస రాగంలో
మృదునాదంలో ..నవ జీవన భావన పలికెనులే
తం తన నంతన తాళంలో.. రస రాగంలో
మృదునాదంలో ..నవ జీవన భావన పలికెనులే

నవ భావనయే సుమ మోహనమై...ఆపై వలపై పిలుపై కళలోలుకగ
తం తన నంతన తాళంలో.. మృదునాదంలో..నవ జీవన భావన పలికెనులే

చరణం 1:

తనన తని నననని నననని తనన
తని నననని నననని తనన
తని నననని నననని తనన..తనన తనన..

ఉల్లము ఝల్లన అల్లరి తెమ్మెర వీచెనులే...
మది దోచెనులే...మరు మల్లెలు సైగలు చేసెనులే
ఆ....ఆ...ఆ...ఆ...
ఉల్లము ఝల్లన అల్లరి తెమ్మెర వీచెనులే...
మది దోచెనులే...మరు మల్లెలు సైగలు చేసెనులే...

కన్నియ ఊహలు వెన్నెలలై...కదలే కదలే విరి ఊయలలై
పున్నమి వేసిన ముగ్గులలో...కన్నులు దాటిన సిగ్గులలో
తేనెలకందని తీయని కోరికలే...చిరు మరులని చిలుకగ

తం తన నంతన తాళంలో..రసరాగంలో మృదునాదంలో...
నవ జీవన భావన పలికెనులే

చరణం 2:

ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ..
పొంచిన మదనుడు పువ్వుల బాణం...నాటెనులే..ఎద మీటెనులే
పులకింతలు హద్దులు దాటెనులే
ఆ...ఆ...ఆ...ఆ...ఆ...
పొంచిన మదనుడు పువ్వుల బాణం...నాటెనులే..ఎద మీటెనులే
పులకింతలు హద్దులు దాటెనులే

మ్రోగెను పరువం రాగిణియై... మురిసే మురిసే చెలి మోహినియై
వన్నెల తుంటల పందిరిలో...వెన్నెల రాయని కౌగిలిలో
ఇద్దరి పెదవుల ముద్దుల అల్లికలే...మృదుమధురిమలోలుకగ

తం తన నంతన తాళంలో...రస రాగంలో మృదునాదంలో
నవ జీవన భావన పలికెనులే...
నవ భావనయే సుమమోహనమై...
ఆపై వలపై పిలుపై కళలొలుకగ...
తం తననం తననం తననం తననం తననం

pallavi:

tananaṁ...tananaṁ...tananaṁ...tananaṁ..ta...
ā....ā....ā...ā...ā...ā...ā..ā..
taṁ...tananaṁ..tananaṁ...tananaṁ...tananaṁ...
taṁ tana naṁtana tāḽaṁlo.. rasa rāgaṁlo
mṛdunādaṁlo ..nava jīvana bhāvana paligĕnule
taṁ tana naṁtana tāḽaṁlo.. rasa rāgaṁlo
mṛdunādaṁlo ..nava jīvana bhāvana paligĕnule

nava bhāvanaye suma mohanamai...ābai valabai pilubai kaḽalolugaga
taṁ tana naṁtana tāḽaṁlo.. mṛdunādaṁlo..nava jīvana bhāvana paligĕnule

saraṇaṁ 1:

tanana tani nananani nananani tanana
tani nananani nananani tanana
tani nananani nananani tanana..tanana tanana..

ullamu jhallana allari tĕmmĕra vīsĕnule...
madi dosĕnule...maru mallĕlu saigalu sesĕnule
ā....ā...ā...ā...
ullamu jhallana allari tĕmmĕra vīsĕnule...
madi dosĕnule...maru mallĕlu saigalu sesĕnule...

kanniya ūhalu vĕnnĕlalai...kadale kadale viri ūyalalai
punnami vesina muggulalo...kannulu dāḍina siggulalo
tenĕlagaṁdani tīyani korigale...siru marulani silugaga

taṁ tana naṁtana tāḽaṁlo..rasarāgaṁlo mṛdunādaṁlo...
nava jīvana bhāvana paligĕnule

saraṇaṁ 2:

ā...ā...ā...ā...ā...ā..
pŏṁchina madanuḍu puvvula bāṇaṁ...nāḍĕnule..ĕda mīḍĕnule
pulagiṁtalu haddulu dāḍĕnule
ā...ā...ā...ā...ā...
pŏṁchina madanuḍu puvvula bāṇaṁ...nāḍĕnule..ĕda mīḍĕnule
pulagiṁtalu haddulu dāḍĕnule

mrogĕnu paruvaṁ rāgiṇiyai... murise murise sĕli mohiniyai
vannĕla tuṁṭala paṁdirilo...vĕnnĕla rāyani kaugililo
iddari pĕdavula muddula alligale...mṛdumadhurimalolugaga

taṁ tana naṁtana tāḽaṁlo...rasa rāgaṁlo mṛdunādaṁlo
nava jīvana bhāvana paligĕnule...
nava bhāvanaye sumamohanamai...
ābai valabai pilubai kaḽalŏlugaga...
taṁ tananaṁ tananaṁ tananaṁ tananaṁ tananaṁ