తలఁచుకొమ్మనవే తనగుణాలెల్లా నేఁడు
(॥పల్లవి॥)
తలఁచుకొమ్మనవే తనగుణాలెల్లా నేఁడు
కొలనిలో సతులను కోరఁడా తాను
(॥॥)
పంతములేలాడీనే పడఁతులుగలవాఁడు
యింతలోనే మరుబాణా లిటు గెల్చెనా
అంతటాను తనసుద్దు లల్లనాఁడే వింటిమి
వింతగా సీతాదేవి వెదకఁడా తాను
(॥॥)
నవ్వులేల నవ్వీనే ననుపైనకోడెకాఁడు
ఇవ్వలఁ దనపాయము ఇట్టె గెల్చెనా
చివ్వునఁ దనయెమ్మెలు చెప్పీనేలే మాముందర
దవ్వుల రుక్మిణికిఁగా తగులఁడా తాను
(॥॥)
చెప్పుకోనేలే మాటలు శ్రీ వేంకటేశ్వరుఁడు
యిప్పుడే తనమనసు యిట్టె గెల్చెనా
వొప్పుగా నన్నిటు గూడె నొరయనేలే చన్నులు
నెప్పున నురాన లక్ష్మి నిలుపఁడా తాను
(||pallavi||)
talam̐sugŏmmanave tanaguṇālĕllā nem̐ḍu
kŏlanilo sadulanu koram̐ḍā tānu
(||||)
paṁtamulelāḍīne paḍam̐tulugalavām̐ḍu
yiṁtalone marubāṇā liḍu gĕlsĕnā
aṁtaḍānu tanasuddu lallanām̐ḍe viṁṭimi
viṁtagā sīdādevi vĕdagam̐ḍā tānu
(||||)
navvulela navvīne nanubainagoḍĕgām̐ḍu
ivvalam̐ danabāyamu iṭṭĕ gĕlsĕnā
sivvunam̐ danayĕmmĕlu sĕppīnele māmuṁdara
davvula rukmiṇigim̐gā tagulam̐ḍā tānu
(||||)
sĕppugonele māḍalu śhrī veṁkaḍeśhvarum̐ḍu
yippuḍe tanamanasu yiṭṭĕ gĕlsĕnā
vŏppugā nanniḍu gūḍĕ nŏrayanele sannulu
nĕppuna nurāna lakṣhmi nilubam̐ḍā tānu