Talamsugo naavallam dappule

తలఁచుకో నావల్లఁ దప్పులే
Language

(॥పల్లవి॥)
తలఁచుకో నావల్లఁ దప్పులే
వెలయ నిన్నింతసేయ వేడుకా నాకు

(॥తల॥)
తమితోఁ బాయక నాదండ నీవే వుండితేను
సముకాన నిన్ను దూరఁ జలమా నాకు
అమరఁగ నీవాడినఅమాటే తప్పకుండితే
జమళి నలిగియుండ సంగతా నాకు

(॥తల॥)
సన్నల నీ విచ్చినచనవే చెల్లించితేను
నిన్ను నేరము లెంచఁగ నేరుపా నాకు
మున్నిటి వొడఁబాటు ముందె నీవుచెప్పెంపితే
విన్నపముసేసి యంప వినోదమా నాకు

(॥తల॥)
గట్టిగా నీవు నన్నుఁ గాఁగిలించుకొంటేను
అట్టె కొంగువట్టితియ్య నాపా నాకు
నెట్టన శ్రీవేంకటేశ నేఁ డిట్టె నన్నేలితివి
ఱట్టుసేయ నాగుండె ఱాయా నాకు

(||pallavi||)
talam̐sugo nāvallam̐ dappule
vĕlaya ninniṁtaseya veḍugā nāgu

(||tala||)
tamidom̐ bāyaga nādaṁḍa nīve vuṁḍidenu
samugāna ninnu dūram̐ jalamā nāgu
amaram̐ga nīvāḍinaamāḍe tappaguṁḍide
jamaḽi naligiyuṁḍa saṁgadā nāgu

(||tala||)
sannala nī vichchinasanave sĕlliṁchidenu
ninnu neramu lĕṁcham̐ga nerubā nāgu
munniḍi vŏḍam̐bāḍu muṁdĕ nīvusĕppĕṁpide
vinnabamusesi yaṁpa vinodamā nāgu

(||tala||)
gaṭṭigā nīvu nannum̐ gām̐giliṁchugŏṁṭenu
aṭṭĕ kŏṁguvaṭṭidiyya nābā nāgu
nĕṭṭana śhrīveṁkaḍeśha nem̐ ḍiṭṭĕ nannelidivi
ṟaṭṭuseya nāguṁḍĕ ṟāyā nāgu