Talamsugo meemdadettu tattarabadavaladu

తలఁచుకో మీఁదటెత్తు తత్తరపడవలదు
Language

(॥పల్లవి॥)
తలఁచుకో మీఁదటెత్తు తత్తరపడవలదు
చలములు మాని ఇఁకఁ జక్కనుండరాదా

(॥తలఁ॥)
కాంత తోడుత నీవు కాఁతాళించి పెనఁగేవు
అంతేసి కోపుదువా అప్పుడు నీవు
పంతమాడవచ్చుఁగాని బలిమి చూపు టరుదు
సంతమై మీలో మీరు చక్కనుండరాదా

(॥తలఁ॥)
మగువ పిలువఁగాను మారుకొని బిగిసేవు
అగడు కోపుదువా అప్పుడు నీవు
నగవచ్చుఁగాని వెనక వేఁడుకోరాదు
జగడాలు మాని ఇఁకఁ జక్కనుండరాదా

(॥తలఁ॥)
కలికి పానుపుమీఁద కాఁగిటిలో మించేవు
అలయనోపుదువా అప్పుడు నీవు
చెలఁగి శ్రీ వేంకటేశ చెప్పవచ్చుఁ జూపరాదు
సలిగె మెరసి మీరు చక్కనుండరాదా

(||pallavi||)
talam̐sugo mīm̐daḍĕttu tattarabaḍavaladu
salamulu māni im̐kam̐ jakkanuṁḍarādā

(||talam̐||)
kāṁta toḍuda nīvu kām̐tāḽiṁchi pĕnam̐gevu
aṁtesi kobuduvā appuḍu nīvu
paṁtamāḍavachchum̐gāni balimi sūbu ṭarudu
saṁtamai mīlo mīru sakkanuṁḍarādā

(||talam̐||)
maguva piluvam̐gānu mārugŏni bigisevu
agaḍu kobuduvā appuḍu nīvu
nagavachchum̐gāni vĕnaga vem̐ḍugorādu
jagaḍālu māni im̐kam̐ jakkanuṁḍarādā

(||talam̐||)
kaligi pānubumīm̐da kām̐giḍilo miṁchevu
alayanobuduvā appuḍu nīvu
sĕlam̐gi śhrī veṁkaḍeśha sĕppavachchum̐ jūbarādu
saligĕ mĕrasi mīru sakkanuṁḍarādā