తలఁచిన తలఁపులు తలకూడీఁ గాక ఇఁక
(॥పల్లవి॥)
తలఁచిన తలఁపులు తలకూడీఁ గాక ఇఁక
కలిగిన నీ బత్తి కడమ వడీనా
(॥తలఁ॥)
యెవ్వతె రానికోపమో యెదలోనఁ బెట్టుక నే
నవ్వినాను వూరక వున్నాఁడవు నీవు
తవ్వితే నిసుకపాఁతరవంటిది వలపు
మవ్వపు వేడుకతోడ మాటలాడవయ్యా
(॥తలఁ॥)
వుమ్మడి నెందకేఁగేవుద్యోగ మున్నదో నీకు
రమ్మని నేఁ బిల్వఁగాఁ బరాకు మానవు
చిమ్మిరేఁగి వూరేటిచలమవంటిది తమి
యెమ్మె చూప నెంతలేదు యింటికి రావయ్యా
(॥తలఁ॥)
అక్కడ నెక్కడిమాఁట లాలకించుకున్నాఁడవో
యిక్కువలు నే నంటినా యేమీ ననవు
చక్కని శ్రీవేంకటేశ జలధివంటిది యాస
యెక్కువ నన్నేలితివి యిట్టె వుండవయ్యా
(||pallavi||)
talam̐sina talam̐pulu talagūḍīm̐ gāga im̐ka
kaligina nī batti kaḍama vaḍīnā
(||talam̐||)
yĕvvadĕ rānigobamo yĕdalonam̐ bĕṭṭuga ne
navvinānu vūraga vunnām̐ḍavu nīvu
tavvide nisugabām̐taravaṁṭidi valabu
mavvabu veḍugadoḍa māḍalāḍavayyā
(||talam̐||)
vummaḍi nĕṁdagem̐gevudyoga munnado nīgu
rammani nem̐ bilvam̐gām̐ barāgu mānavu
simmirem̐gi vūreḍisalamavaṁṭidi tami
yĕmmĕ sūba nĕṁtaledu yiṁṭigi rāvayyā
(||talam̐||)
akkaḍa nĕkkaḍimām̐ṭa lālagiṁchugunnām̐ḍavo
yikkuvalu ne naṁṭinā yemī nanavu
sakkani śhrīveṁkaḍeśha jaladhivaṁṭidi yāsa
yĕkkuva nannelidivi yiṭṭĕ vuṁḍavayyā