(॥పల్లవి॥)
తలఁచమైతిమి మీ తగులాయము
చెలి నిన్నేమి సేసినాఁ జెల్లునయ్యా నేఁడు
(॥తల॥)
వలచివచ్చినవారు వాకిటఁ గాచుకుండఁగ
తొలుతే విన్నీకె యేల తొంగిచూ చీని
సలిగె గలిగితేను సాదించకపోరాదు
తలిరుఁబోఁడికి నిది తగునయ్యా నేఁడు
(॥తల॥)
కోరి సతులెల్లా నీకుఁ గొలువులుసేయఁగాను
వూరకే వచ్చి తాను నీవొడిపట్టీని
యీరీతి మీపొందులౌత యెఱఁగమైతిమి నేము
కూరిమికాంతకు నిదె గుణమయ్యా నేఁడు
(॥తల॥)
నెట్టుకొని సవతులు నీపాదము లొత్తఁగాను
గట్టిగా నీవద్దఁ బండి కాఁగిలించీని
ఇట్టె శ్రీవేంకటేశ యేలితివి మమ్మిందరి
జట్టిగొన్నయింత కిది సాజమయ్యీ నేఁడు
(||pallavi||)
talam̐samaidimi mī tagulāyamu
sĕli ninnemi sesinām̐ jĕllunayyā nem̐ḍu
(||tala||)
valasivachchinavāru vāgiḍam̐ gāsuguṁḍam̐ga
tŏlude vinnīgĕ yela tŏṁgisū sīni
saligĕ galigidenu sādiṁchagaborādu
talirum̐bom̐ḍigi nidi tagunayyā nem̐ḍu
(||tala||)
kori sadulĕllā nīgum̐ gŏluvuluseyam̐gānu
vūrage vachchi tānu nīvŏḍibaṭṭīni
yīrīdi mībŏṁdulauda yĕṟam̐gamaidimi nemu
kūrimigāṁtagu nidĕ guṇamayyā nem̐ḍu
(||tala||)
nĕṭṭugŏni savadulu nībādamu lŏttam̐gānu
gaṭṭigā nīvaddam̐ baṁḍi kām̐giliṁchīni
iṭṭĕ śhrīveṁkaḍeśha yelidivi mammiṁdari
jaṭṭigŏnnayiṁta kidi sājamayyī nem̐ḍu