Tala dadisinabude sali vaasenu

తల దడిసినపుడే చలి వాసెను
Language

(॥పల్లవి॥)
తల దడిసినపుడే చలి వాసెను
చెలరేఁగుటేకాక సిగ్గువడేవా

(॥తల॥)
గొల్లెతలు నీవును గోకులములో నుండి
అల్లిఁ దామోరలవలె నల్లుకొంటివి
వెల్లవిరిగా నే నెంత వెంగెము లాడినాను
చెల్లుబడులేకాకసిగ్గువడేవా

(॥తల॥)
అగడుగ మరియుఁ బదారువేలసతులతో
తగుఁదీగెలు మాఁకులై తగిలితివి
తగదనినే నెంత తప్పులు ని న్నెంచినాను
జిగిమీరుదువుగాక సిగ్గువడేవా

(॥తల॥)
భావించఁగా నీ వప్పటిఁ బట్టపుదేవుళ్ళతోడ
పూవునుఁ బుప్పొడియైపొందితివి
యీవల శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టె
చేవదేర నే నవ్వితే సిగ్గువడేవా

(||pallavi||)
tala daḍisinabuḍe sali vāsĕnu
sĕlarem̐guḍegāga sigguvaḍevā

(||tala||)
gŏllĕdalu nīvunu gogulamulo nuṁḍi
allim̐ dāmoralavalĕ nallugŏṁṭivi
vĕllavirigā ne nĕṁta vĕṁgĕmu lāḍinānu
sĕllubaḍulegāgasigguvaḍevā

(||tala||)
agaḍuga mariyum̐ badāruvelasadulado
tagum̐dīgĕlu mām̐kulai tagilidivi
tagadanine nĕṁta tappulu ni nnĕṁchinānu
jigimīruduvugāga sigguvaḍevā

(||tala||)
bhāviṁcham̐gā nī vappaḍim̐ baṭṭabudevuḽḽadoḍa
pūvunum̐ buppŏḍiyaibŏṁdidivi
yīvala śhrīveṁkaḍeśha yelidivi nannu niṭṭĕ
sevadera ne navvide sigguvaḍevā