Takkinavaariginela tamaga mamaru

తక్కినవారికినేల తమక మమరు
Language

(॥పల్లవి॥)
తక్కినవారికినేల తమక మమరు
వెక్కసపువారికిని వేడ్కలిదె యమరు

(॥తక్కి॥)
చనపుగలవారికిని సరసమాడిన నమరు
ననుపుగలవారికిని నగవు లమరు
మనవిగలవారికిని మంతనంబులు నమరు
పనులుగలవారికిని పైకొనుట లమరు

(॥తక్కి॥)
బలిమిగలవారికిని పంతమాడిన నమరు
వలపుగలవారికిని వాడికమరు
చలముగలవారికిని జంకెనలు కడు నమరు
తలఁపుగలవారికిని తగులాయ మమరు

(॥తక్కి॥)
ఆసగలవారికిని అందనుండఁగ నమరు
వాసిగలవారికిని వన్నెలమరు
సేసతోఁ గూడితివి శ్రీవేంకటేశ నను
బాసగలవారికిని పనులెల్ల నమరు

(||pallavi||)
takkinavāriginela tamaga mamaru
vĕkkasabuvārigini veḍkalidĕ yamaru

(||takki||)
sanabugalavārigini sarasamāḍina namaru
nanubugalavārigini nagavu lamaru
manavigalavārigini maṁtanaṁbulu namaru
panulugalavārigini paigŏnuḍa lamaru

(||takki||)
balimigalavārigini paṁtamāḍina namaru
valabugalavārigini vāḍigamaru
salamugalavārigini jaṁkĕnalu kaḍu namaru
talam̐pugalavārigini tagulāya mamaru

(||takki||)
āsagalavārigini aṁdanuṁḍam̐ga namaru
vāsigalavārigini vannĕlamaru
sesadom̐ gūḍidivi śhrīveṁkaḍeśha nanu
bāsagalavārigini panulĕlla namaru