తగును మీ ఇద్దరికి తలఁచుకో నా మాఁట
(॥పల్లవి॥)
తగును మీ ఇద్దరికి తలఁచుకో నా మాఁట
నెగడె మీ కూటములు నిక్కములు నేఁడు
(॥తగు॥)
వదలఁదగునా ప్రియము వలపుగలవారికిని
యెదురుకొని వినయములు హెచ్చవలెఁగాక
చెదరఁదగునా మనము చెలిమిగలవారికిని
పొదలి ఇచ్చకములనే పొరలవలెఁగాక
(॥తగు॥)
విడువఁదగునా యాస వేడుకగలవారికిని
వుడివోని తమకమున నుండవలెఁగాక
కడవఁదగునా మాట కైవసవువారికిని
కొడిసాగఁబను లియ్యకొనఁగవలెఁగాక
(॥తగు॥)
మఱవఁదగునా మేలు మమతగలవారికిని
మెఱసి రతులను నేర్పు మించవలెఁగాక
వెఱవఁదగునా చనవు వెలఇంచువారికిని
యెఱిఁగి శ్రీవేంకటేశు నెనయవలెఁగాక
(||pallavi||)
tagunu mī iddarigi talam̐sugo nā mām̐ṭa
nĕgaḍĕ mī kūḍamulu nikkamulu nem̐ḍu
(||tagu||)
vadalam̐dagunā priyamu valabugalavārigini
yĕdurugŏni vinayamulu hĕchchavalĕm̐gāga
sĕdaram̐dagunā manamu sĕlimigalavārigini
pŏdali ichchagamulane pŏralavalĕm̐gāga
(||tagu||)
viḍuvam̐dagunā yāsa veḍugagalavārigini
vuḍivoni tamagamuna nuṁḍavalĕm̐gāga
kaḍavam̐dagunā māḍa kaivasavuvārigini
kŏḍisāgam̐banu liyyagŏnam̐gavalĕm̐gāga
(||tagu||)
maṟavam̐dagunā melu mamadagalavārigini
mĕṟasi radulanu nerbu miṁchavalĕm̐gāga
vĕṟavam̐dagunā sanavu vĕla̮iṁchuvārigini
yĕṟim̐gi śhrīveṁkaḍeśhu nĕnayavalĕm̐gāga