తగునయ్య నీకిన్నియు దైవపురాయ
(॥పల్లవి॥)
తగునయ్య నీకిన్నియు దైవపురాయ
మొగమునఁ గళనిండె మోహనరాయా
(॥తగు॥)
మీఱుచు మాటలాడి మెలుఁత చెక్కుల వెంట
జాణించితిగా చెమట జాణరాయ
ఆఱడిమాఁటలాడి అట్టె పట్టినీవు
చూఱగొంటివిగా సిగ్గు సుగుణరాయ
(॥తగు॥)
మంతనాన నవ్వుతానే మర్మములు గరఁగించి
వింతలు సేసితివిగా విటరాయ
అంతలోనే పైకొని అధరపుఁదేనే లిచ్చి
చెంతఁ జొక్కించితివిగా చెలువరాయ
(॥తగు॥)
పులకలు పెడరేఁచి పొందులెల్లాఁ జేసి యీకెఁ
జెలరేఁగించితివిగా సింగారరాయ
బలురతుల నోలార్చిపలుమారు మన్నించి
చిలికితివిగా మేలు శ్రీవేంకటరాయా
(||pallavi||)
tagunayya nīginniyu daivaburāya
mŏgamunam̐ gaḽaniṁḍĕ mohanarāyā
(||tagu||)
mīṟusu māḍalāḍi mĕlum̐ta sĕkkula vĕṁṭa
jāṇiṁchidigā sĕmaḍa jāṇarāya
āṟaḍimām̐ṭalāḍi aṭṭĕ paṭṭinīvu
sūṟagŏṁṭivigā siggu suguṇarāya
(||tagu||)
maṁtanāna navvudāne marmamulu garam̐giṁchi
viṁtalu sesidivigā viḍarāya
aṁtalone paigŏni adharabum̐dene lichchi
sĕṁtam̐ jŏkkiṁchidivigā sĕluvarāya
(||tagu||)
pulagalu pĕḍarem̐si pŏṁdulĕllām̐ jesi yīgĕm̐
jĕlarem̐giṁchidivigā siṁgārarāya
baluradula nolārsibalumāru manniṁchi
siligidivigā melu śhrīveṁkaḍarāyā