తగులమిగల చోట తగవు నెరపవద్దా
(॥పల్లవి॥)
తగులమిగల చోట తగవు నెరపవద్దా
నిగిడి పొందులు సేయ నెరజాణఁ డతఁడు
(॥తగు॥)
చనవున రమణుని జంకించినదానవు
మనసు రంజిల్లఁ గొంత మాఁటాడవే
కొనచూపులనుఁ గడు కొచ్చి చూచిన దానవు
వినయానఁ జెక్కునొక్కి వేఁడుకొనఁ గదవే
(॥తగు॥)
యిందాఁకా నాసలఁ బెట్టి యెలయించినదానవు
కందువ లంటి మనసు గరఁగించవే
చెంది చెనకితే గోరఁ జిమ్మినట్టిదానవు
ముందుగానే మొక్కు మొక్కి మోవితేనె లియ్యవే
(॥తగు॥)
సరి వెనఁగి గుబ్బల సారె నొత్తిన దానవు
సురత గతులచేఁత జొక్కించవే
యిరవై శ్రీవేంకటేశు నింతసేసినదానవు
బెరసి చెప్పఁదగిన ప్రియమెల్లాఁ జెప్పవే
(||pallavi||)
tagulamigala soḍa tagavu nĕrabavaddā
nigiḍi pŏṁdulu seya nĕrajāṇam̐ ḍadam̐ḍu
(||tagu||)
sanavuna ramaṇuni jaṁkiṁchinadānavu
manasu raṁjillam̐ gŏṁta mām̐ṭāḍave
kŏnasūbulanum̐ gaḍu kŏchchi sūsina dānavu
vinayānam̐ jĕkkunŏkki vem̐ḍugŏnam̐ gadave
(||tagu||)
yiṁdām̐kā nāsalam̐ bĕṭṭi yĕlayiṁchinadānavu
kaṁduva laṁṭi manasu garam̐giṁchave
sĕṁdi sĕnagide goram̐ jimminaṭṭidānavu
muṁdugāne mŏkku mŏkki movidenĕ liyyave
(||tagu||)
sari vĕnam̐gi gubbala sārĕ nŏttina dānavu
surada gadulasem̐ta jŏkkiṁchave
yiravai śhrīveṁkaḍeśhu niṁtasesinadānavu
bĕrasi sĕppam̐dagina priyamĕllām̐ jĕppave