Tagavu taane yeṟumgu taam jesina semtagu

తగవు తానె యెఱుఁగు తాఁ జేసిన చేఁతకు
Language

(॥పల్లవి॥)
తగవు తానె యెఱుఁగు తాఁ జేసిన చేఁతకు
చిగురునవ్వులు రేఁచె చెక్కు చేతిచెలిని

(॥తగ॥)
కొప్పు దువ్వుమనఁగదే కురుచులగూడఁ జెలికి
ఇప్పుడే తాఁబానుపుపై వింతసేసెను
దప్పికిఁ బన్నీరుసు తానే ఇమ్మనఁగదే
మిప్పిరిగా నలఇంచె మొక్కఁగానే చెలిని

(॥తగ॥)
వీడె మిమ్మనఁగదవే వెస నిచ్చకముగాను
యీడఁ దెరమఱంగున నింతసేసెను
వాడువిడువ సురటి వడి విసరుమనవే
జోడై నిట్టూర్పులు రేఁచె చూడఁగానే చెలిని

(॥తగ॥)
గంద మిమ్మనఁగదవే కాఁగిట శ్రీవేంకటేశుఁ
డిందుముఖిఁ జెమరింప నింతసేసెను
కందువాయ మోవికే కప్పుర మిమ్మనగదే
అంది కళలెల్లా రేఁచె నంటఁగానే చెలిని

(||pallavi||)
tagavu tānĕ yĕṟum̐gu tām̐ jesina sem̐tagu
sigurunavvulu rem̐sĕ sĕkku sedisĕlini

(||taga||)
kŏppu duvvumanam̐gade kurusulagūḍam̐ jĕligi
ippuḍe tām̐bānububai viṁtasesĕnu
dappigim̐ bannīrusu tāne immanam̐gade
mippirigā nala̮iṁchĕ mŏkkam̐gāne sĕlini

(||taga||)
vīḍĕ mimmanam̐gadave vĕsa nichchagamugānu
yīḍam̐ dĕramaṟaṁguna niṁtasesĕnu
vāḍuviḍuva suraḍi vaḍi visarumanave
joḍai niṭṭūrbulu rem̐sĕ sūḍam̐gāne sĕlini

(||taga||)
gaṁda mimmanam̐gadave kām̐giḍa śhrīveṁkaḍeśhum̐
ḍiṁdumukhim̐ jĕmariṁpa niṁtasesĕnu
kaṁduvāya movige kappura mimmanagade
aṁdi kaḽalĕllā rem̐sĕ naṁṭam̐gāne sĕlini