తగవు నీ వెఱఁగవా తప్పు నాయం దిఁకలేదు
(॥పల్లవి॥)
తగవు నీ వెఱఁగవా తప్పు నాయం దిఁకలేదు
వెగటైనవారితోడ వియ్యమంద వచ్చేమా
(॥తగ॥)
పంతము దప్పీనా పలికితేను నీవు
రంతు మగనాలవు రాఁపుసేసేమా
పొంతపొరుగుననుండేపొందుసతి వని కాక
మంతనాన నందరితో మాఁటలాడ వచ్చేమా
(॥తగ॥)
జవ్వనము వెలితౌనా సారె నాతో నవ్వితేను
రవ్వ నీ దొరతనము రాఁపుసేసేమా
యివ్వల నొక్క వయసే యిద్దరికినని కాక
దవ్వులవారితో జానతన మాడవచ్చేమా
(॥తగ॥)
కాయము కొంతరగీనా కాఁగిలించితే నన్ను
రాయడి నీతమకము రతి దూరేమా
వేయిటి శ్రీవేంకటాద్రి విభుఁడ నయిననన్ను
చాయలఁ గూడితి విఁక సారె మెచ్చకుండేమా
(||pallavi||)
tagavu nī vĕṟam̐gavā tappu nāyaṁ dim̐kaledu
vĕgaḍainavāridoḍa viyyamaṁda vachchemā
(||taga||)
paṁtamu dappīnā paligidenu nīvu
raṁtu maganālavu rām̐pusesemā
pŏṁtabŏrugunanuṁḍebŏṁdusadi vani kāga
maṁtanāna naṁdarido mām̐ṭalāḍa vachchemā
(||taga||)
javvanamu vĕlidaunā sārĕ nādo navvidenu
ravva nī dŏradanamu rām̐pusesemā
yivvala nŏkka vayase yiddariginani kāga
davvulavārido jānadana māḍavachchemā
(||taga||)
kāyamu kŏṁtaragīnā kām̐giliṁchide nannu
rāyaḍi nīdamagamu radi dūremā
veyiḍi śhrīveṁkaḍādri vibhum̐ḍa nayinanannu
sāyalam̐ gūḍidi vim̐ka sārĕ mĕchchaguṁḍemā