Taga veṟamgavaddaa tamagimchi senagevu

తగ వెఱఁగవద్దా తమకించి చెనకేవు
Language

(॥పల్లవి॥)
తగ వెఱఁగవద్దా తమకించి చెనకేవు
మగువల తలనేల మహిఁ బూరిగట్టేవే

(॥॥)
కందువ నాతఁడు నాతోఁ గతలు చెప్పఁగాను
సందుడినీమాటలు చవులౌనటే
యెందును మావలపులు యేకములై యుండగాఁను
మందమిరియాలు చల్ల మరియేఁటికే

(॥॥)
ఇంగితాన నిద్దరము నేకతములాడఁగాను
తొంగి చూచి యెవ్వతెకుఁ దొరలనేలే
చెంగటనే మాపొందు చెట్టుకట్టి వుండఁగాను
పొంగి పొంగి వుప్పు వేసి పొత్తుగలయనేలే

(॥॥)
చేరి శ్రీ వేంకటేశుఁడు కోరి నాకు విడెమీఁగా
పొరచివారు చెయిచాఁచఁ బొసఁగునటే
మేరతో నన్నేలే నలమేలుమంగనైనదాన
సారె నడుమఁ బసవు నూర నీకేఁటికే

(||pallavi||)
taga vĕṟam̐gavaddā tamagiṁchi sĕnagevu
maguvala talanela mahim̐ būrigaṭṭeve

(||||)
kaṁduva nādam̐ḍu nādom̐ gadalu sĕppam̐gānu
saṁduḍinīmāḍalu savulaunaḍe
yĕṁdunu māvalabulu yegamulai yuṁḍagām̐nu
maṁdamiriyālu salla mariyem̐ṭige

(||||)
iṁgidāna niddaramu negadamulāḍam̐gānu
tŏṁgi sūsi yĕvvadĕgum̐ dŏralanele
sĕṁgaḍane mābŏṁdu sĕṭṭugaṭṭi vuṁḍam̐gānu
pŏṁgi pŏṁgi vuppu vesi pŏttugalayanele

(||||)
seri śhrī veṁkaḍeśhum̐ḍu kori nāgu viḍĕmīm̐gā
pŏrasivāru sĕyisām̐sam̐ bŏsam̐gunaḍe
merado nannele nalamelumaṁganainadāna
sārĕ naḍumam̐ basavu nūra nīgem̐ṭige