తడవాయ నేము వచ్చి తతి వచ్చెఁ జెలియకు
(॥పల్లవి॥)
తడవాయ నేము వచ్చి తతి వచ్చెఁ జెలియకు
కడు దక్కె రావయ్య కాంతభాగ్యములు
(॥తడ॥)
పూచెను జవ్వనము పొలిఁతి మైపులకల
కాచెను నిమ్మపండ్లు ఘనకుచాల
వాచవుల దొండవండు వడిఁ జండెఁ గెమ్మోని
చూచివత్తురావయ్య సుదతి భాగ్యములు
(॥తడ॥)
పలికెఁ జిలుకలు పడఁతి మాటలలోనె
తొలఁకెఁ జల్లని గాలి దొమ్మి వూర్పుల
వలపుల కందువల వసంతకాలము వచ్చె
తెలిసివత్తు రావయ్య తెరవ భాగ్యములు
(॥తడ॥)
చెమటల కొలఁకులు చెలిమేన దైవారె
తమి నవ్వువెన్నెలలు దట్టమాయను
అమర శ్రీవేంకటేశ అంగనఁ గూడితి విట్టె
రమియింతు రావయ్య రమణి భాగ్యములు
(||pallavi||)
taḍavāya nemu vachchi tadi vachchĕm̐ jĕliyagu
kaḍu dakkĕ rāvayya kāṁtabhāgyamulu
(||taḍa||)
pūsĕnu javvanamu pŏlim̐ti maibulagala
kāsĕnu nimmabaṁḍlu ghanagusāla
vāsavula dŏṁḍavaṁḍu vaḍim̐ jaṁḍĕm̐ gĕmmoni
sūsivatturāvayya sudadi bhāgyamulu
(||taḍa||)
paligĕm̐ jilugalu paḍam̐ti māḍalalonĕ
tŏlam̐kĕm̐ jallani gāli dŏmmi vūrbula
valabula kaṁduvala vasaṁtagālamu vachchĕ
tĕlisivattu rāvayya tĕrava bhāgyamulu
(||taḍa||)
sĕmaḍala kŏlam̐kulu sĕlimena daivārĕ
tami navvuvĕnnĕlalu daṭṭamāyanu
amara śhrīveṁkaḍeśha aṁganam̐ gūḍidi viṭṭĕ
ramiyiṁtu rāvayya ramaṇi bhāgyamulu