Taarugaana limkanelaa tagulaina panulagu

తారుకాణ లిఁకనేలా తగులైన పనులకు
Language

(॥పల్లవి॥)
తారుకాణ లిఁకనేలా తగులైన పనులకు
నేరుతు వన్ని విద్యలా నెరజాణ వౌదువు

(॥తారు॥)
సొరిది నీమోవిమిఁది సూదివాటులే చెప్పీ
గరిమల నీవు సేసే కాఁపురాలెల్లా
కురులు చెదరినట్టి గురుతులే చెప్పీని
సుతవిభముల చొప్పలెల్లాను

(॥తారు॥)
చెక్కులమిఁదటి నీ చిరుఁ జెమటలే చెప్పీ
గక్కన నీవు గడించే కలిమెల్లాను
చక్కని నీమోము కళకే చాటిచాటి చెప్పీని
మక్కువతో నీమనసుమర్మములెల్లాను

(॥తారు॥)
మనుకొన్న నీ ముసిముసి నవ్వులే చెప్పీ
పనివోని పొందులదాఁపురాలెల్లా
య(యె?) నసిన శ్రీవేంకటేశ నీకాఁగిలే చెప్పీ
జునగని నీనా సంది చుట్టరికా లెల్లును

(||pallavi||)
tārugāṇa lim̐kanelā tagulaina panulagu
nerudu vanni vidyalā nĕrajāṇa vauduvu

(||tāru||)
sŏridi nīmovimim̐di sūdivāḍule sĕppī
garimala nīvu sese kām̐purālĕllā
kurulu sĕdarinaṭṭi gurudule sĕppīni
sudavibhamula sŏppalĕllānu

(||tāru||)
sĕkkulamim̐daḍi nī sirum̐ jĕmaḍale sĕppī
gakkana nīvu gaḍiṁche kalimĕllānu
sakkani nīmomu kaḽage sāḍisāḍi sĕppīni
makkuvado nīmanasumarmamulĕllānu

(||tāru||)
manugŏnna nī musimusi navvule sĕppī
panivoni pŏṁduladām̐purālĕllā
ya(yĕ?) nasina śhrīveṁkaḍeśha nīgām̐gile sĕppī
junagani nīnā saṁdi suṭṭarigā lĕllunu