పల్లవి:
తారక చెప్పదు ఏనాడు
జాబిలి వెన్నెల వీడ్కోలు
ఆకాశానికి ఆ రెండూ
దేవుడు పెట్టిన దీపాలు
తారక అడగదు ఏనాడు
పున్నమి వెన్నెల వీడ్కోలు
అనురాగానికి ఆ రెండూ
మమతల హారతి కాబోలు
చరణం 1:
ఉదయకాంతిని పెదవుల మెరిసి
తాంబూలంగా చూస్తుంటా
నీలి మబ్బుని నీలాల కురులకే
చుక్క మల్లెలే అందిస్తా
చిరుగాలులు నీ తాకిడిగా
సెలయేరులు నీ అలికిడిగా
నాలో నిన్నే చూసుకుంటూ
కాలం ఇట్టే గడిపేస్తా
కాలమంతా కరిగిపోయే కౌగిలింతలు నేనిస్తా
||తారక అడగదు ఏనాడు||
చరణం 2:
వేడి ఆశనై వేసవి గాలుల
వెచ్చని కబురులు పంపిస్తా
కలల నీడలే కౌగిళ్లనుకొని
కలవరింతగా కలిసొస్తా
నెలవంకలు నీ నవ్వులుగా
కలహంసలు నీ నడకలుగా
కావ్యాలెన్నో రాసుకుంటూ
కవినే నీకై వినిపిస్తా
కవితలాగా నిలిచిపోయే అనుభవాలే పండిస్తా
||తారక చెప్పదు||
pallavi:
tāraga sĕppadu enāḍu
jābili vĕnnĕla vīḍkolu
āgāśhānigi ā rĕṁḍū
devuḍu pĕṭṭina dībālu
tāraga aḍagadu enāḍu
punnami vĕnnĕla vīḍkolu
anurāgānigi ā rĕṁḍū
mamadala hāradi kābolu
saraṇaṁ 1:
udayagāṁtini pĕdavula mĕrisi
tāṁbūlaṁgā sūstuṁṭā
nīli mabbuni nīlāla kurulage
sukka mallĕle aṁdistā
sirugālulu nī tāgiḍigā
sĕlayerulu nī aligiḍigā
nālo ninne sūsuguṁṭū
kālaṁ iṭṭe gaḍibestā
kālamaṁtā karigiboye kaugiliṁtalu nenistā
||tāraga aḍagadu enāḍu||
saraṇaṁ 2:
veḍi āśhanai vesavi gālula
vĕchchani kaburulu paṁpistā
kalala nīḍale kaugiḽlanugŏni
kalavariṁtagā kalisŏstā
nĕlavaṁkalu nī navvulugā
kalahaṁsalu nī naḍagalugā
kāvyālĕnno rāsuguṁṭū
kavine nīgai vinibistā
kavidalāgā nilisiboye anubhavāle paṁḍistā
||tāraga sĕppadu||