Taanu sesina panulu dakkavalenamtaanu

తాను సేసిన పనులు దక్కవలెనంటాను
Language

(॥పల్లవి॥)
తాను సేసిన పనులు దక్కవలెనంటాను
నానఁబెట్టుక లోలోనే నవ్వులు నవ్వీనే

(॥తాను॥)
తగవులు చెప్పరాదు తనను నేమీ ననరాను
మగువ సవతిగాఁగా మాటాడితినే
అగడు సేసితినంటా అదె నెపము సేసుక
పగటున పానుపుపై పవ్వళించియున్నాఁడే

(॥తాను॥)
వలపులు రేఁచరాను వాడులు వెట్టుకోరాను
చెలికత్తెగాఁగా నటు చెనకితినే
చలము సాదించెనంటా సాకిరు లందరిఁబెట్టి
వెలయఁగ దోమతెర వేసుకవున్నాఁడే

(॥తాను॥)
కల్లమోపరాను తన్ను కరకరంచరా నాకె
చెల్లెలుగాఁగాఁ బెండ్లి సేసితినే
ఇల్లిదె శ్రీవేంకటేశుఁ డేలె నన్ను మీరెనంటా
పల్లదానఁ గాఁగిలించి పాయకున్నాఁడే

(||pallavi||)
tānu sesina panulu dakkavalĕnaṁṭānu
nānam̐bĕṭṭuga lolone navvulu navvīne

(||tānu||)
tagavulu sĕpparādu tananu nemī nanarānu
maguva savadigām̐gā māḍāḍidine
agaḍu sesidinaṁṭā adĕ nĕbamu sesuga
pagaḍuna pānububai pavvaḽiṁchiyunnām̐ḍe

(||tānu||)
valabulu rem̐sarānu vāḍulu vĕṭṭugorānu
sĕligattĕgām̐gā naḍu sĕnagidine
salamu sādiṁchĕnaṁṭā sāgiru laṁdarim̐bĕṭṭi
vĕlayam̐ga domadĕra vesugavunnām̐ḍe

(||tānu||)
kallamobarānu tannu karagaraṁcharā nāgĕ
sĕllĕlugām̐gām̐ bĕṁḍli sesidine
illidĕ śhrīveṁkaḍeśhum̐ ḍelĕ nannu mīrĕnaṁṭā
palladānam̐ gām̐giliṁchi pāyagunnām̐ḍe