తాను నాతోనన్నమాఁట తానెఱుఁగును
(॥పల్లవి॥)
తాను నాతోనన్నమాఁట తానెఱుఁగును
నానఁబెట్టి సిగ్గులేల నాఁటుకొలిపీని
(॥తాను॥)
నాముందరి కిట్టె వచ్చి నాతో నాడుమనరాదా
యేమిటికిఁ జెప్పిపంపీ నెడమాఁటలు
మోముచూచి నాచేత మొక్కించుకొమ్మనరాదా
రామలకెల్లాఁ జెప్పి రాఁపేల సేసీవి
(॥తాను॥)
యెదుటికి వచ్చి వీడెమిప్పించుకొమ్మనరాదా
పదిమారులు లేకలు పంపనేఁటికి
కొదదీరఁ బానుపుపైఁ గూచుండుమనఁగరాదా
వుదటున ననునెంత వొడఁబరపించీని
(॥తాను॥)
చేరి నాచేత సేవలు సేయించుకొమ్మనరాదా
యీరీతి దెరమఱ గిఁకనేఁటికి
కోరి యలమేలుమంగఁ గూడె శ్రీవేంకటేశుఁడు
వేరులేక నన్నునెంత వేఁడుకొనీని
(||pallavi||)
tānu nādonannamām̐ṭa tānĕṟum̐gunu
nānam̐bĕṭṭi siggulela nām̐ṭugŏlibīni
(||tānu||)
nāmuṁdari kiṭṭĕ vachchi nādo nāḍumanarādā
yemiḍigim̐ jĕppibaṁpī nĕḍamām̐ṭalu
momusūsi nāseda mŏkkiṁchugŏmmanarādā
rāmalagĕllām̐ jĕppi rām̐pela sesīvi
(||tānu||)
yĕduḍigi vachchi vīḍĕmippiṁchugŏmmanarādā
padimārulu legalu paṁpanem̐ṭigi
kŏdadīram̐ bānububaim̐ gūsuṁḍumanam̐garādā
vudaḍuna nanunĕṁta vŏḍam̐barabiṁchīni
(||tānu||)
seri nāseda sevalu seyiṁchugŏmmanarādā
yīrīdi dĕramaṟa gim̐kanem̐ṭigi
kori yalamelumaṁgam̐ gūḍĕ śhrīveṁkaḍeśhum̐ḍu
verulega nannunĕṁta vem̐ḍugŏnīni