తానూఁ బైపైనే వున్నది తమితో నీ కూటమికి
(॥పల్లవి॥)
తానూఁ బైపైనే వున్నది తమితో నీ కూటమికి
యీ నటన లేమి నేర్చే నెంతవేసాలాఁడి
(॥తాన॥)
వొడివట్టి తియ్యఁగాను వొయ్యనే పెనఁగీ నీతో
పడఁతి లేఁతసిగ్గులపగటుతోను
వొడఁబరచఁగ నిన్ను నొద్దని తోయఁగలేక
నిడుసాగిల నెలుఁగు నేరువుతోఁ బెంచీని
(॥తాన॥)
చన్నులు చేత నంటఁగ సగము గుంపీచీని
సన్నలనే కొంత బొమ్మజంకెనతోను
వున్నతిఁ గాఁగిలించఁగా నోపననఁజాలక
కన్నులు మూసి మోనానఁ గమ్మి పైనొరగీని
(॥తాన॥)
లాలించి మోవియానగా లలినొడ్డుకొనరాక
తేలించి మోముచూచి వాతెర చూపీని
వొలివెట్టి నన్నుఁగూడి వొద్దికై శ్రీవేంకటేశ
యీలీలఁ దన్ను నేలఁగా నింపులు నెరపీని
(||pallavi||)
tānūm̐ baibaine vunnadi tamido nī kūḍamigi
yī naḍana lemi nerse nĕṁtavesālām̐ḍi
(||tāna||)
vŏḍivaṭṭi tiyyam̐gānu vŏyyane pĕnam̐gī nīdo
paḍam̐ti lem̐tasiggulabagaḍudonu
vŏḍam̐barasam̐ga ninnu nŏddani toyam̐galega
niḍusāgila nĕlum̐gu neruvudom̐ bĕṁchīni
(||tāna||)
sannulu seda naṁṭam̐ga sagamu guṁpīsīni
sannalane kŏṁta bŏmmajaṁkĕnadonu
vunnadim̐ gām̐giliṁcham̐gā nobananam̐jālaga
kannulu mūsi monānam̐ gammi painŏragīni
(||tāna||)
lāliṁchi moviyānagā lalinŏḍḍugŏnarāga
teliṁchi momusūsi vādĕra sūbīni
vŏlivĕṭṭi nannum̐gūḍi vŏddigai śhrīveṁkaḍeśha
yīlīlam̐ dannu nelam̐gā niṁpulu nĕrabīni