Taanoo savadinamtaa taarugaanagela vachchee

తానూ సవతినంటా తారుకాణకేల వచ్చీ
Language

(॥పల్లవి॥)
తానూ సవతినంటా తారుకాణకేల వచ్చీ
మానుమనరే యెమ్మెలు మదిరాక్షులాల

(॥తానూ॥)
చెప్పరాని మాటలు చెవియొగ్గి వినరాదు
పిప్పిలో నిరసములు పిండుకోరాదు
వుప్పాఁ జప్పాగాని చవులుట్టిఁ బెట్టుకొనరాదు
చెప్పరే యాపెకు బుద్ది చెలియలాల

(॥తానూ॥)
వలవని వలపులు వంచి వొడిఁగట్టరాదు
పిలువని పేరఁటము పెనచరాదు
మొలవనిమొలకలు మోపులు గట్టఁగరాదు
తెలుపరే యావిధము తెరవలాల

(॥తానూ॥)
ఆఁపరానికోరికలు అంగడిఁ బెట్టఁగరాదు
చూపరాని గుఱుతులు చూడఁగరాదు
యేపున శ్రీపేంకటేశుఁ డింతలోనె నన్నుఁ గూడె
మాపొందులు వొగడరే మగువలాల

(||pallavi||)
tānū savadinaṁṭā tārugāṇagela vachchī
mānumanare yĕmmĕlu madirākṣhulāla

(||tānū||)
sĕpparāni māḍalu sĕviyŏggi vinarādu
pippilo nirasamulu piṁḍugorādu
vuppām̐ jappāgāni savuluṭṭim̐ bĕṭṭugŏnarādu
sĕppare yābĕgu buddi sĕliyalāla

(||tānū||)
valavani valabulu vaṁchi vŏḍim̐gaṭṭarādu
piluvani peram̐ṭamu pĕnasarādu
mŏlavanimŏlagalu mobulu gaṭṭam̐garādu
tĕlubare yāvidhamu tĕravalāla

(||tānū||)
ām̐parānigorigalu aṁgaḍim̐ bĕṭṭam̐garādu
sūbarāni guṟudulu sūḍam̐garādu
yebuna śhrībeṁkaḍeśhum̐ ḍiṁtalonĕ nannum̐ gūḍĕ
mābŏṁdulu vŏgaḍare maguvalāla