తానెరుఁగు నేకతపు తనచేఁతలు
(॥పల్లవి॥)
తానెరుఁగు నేకతపు తనచేఁతలు
యీ నిజములెల్ల మీ యెదుటనేకాక
(॥తానె॥)
తప్పులేదని మంచితగవులే చెప్పీని
అప్పుడాడిమాట లాడెనటవే
దప్పి మోమునఁ దేర దయలు వుట్టించీని
యిప్పు డిందాఁకా దా నిట్టుండెనా
(॥తానె॥)
నడుమ నూరక ఇచట నవ్వులే నవ్వీని
వుడివోనియాచలము లున్నవటవే
విడువ కిటు నాయెదుట వేసాలు సేసీని
అడరి తనవోజ నే నది యెఱఁగనా
(॥తానె॥)
మొగమోటమునఁ దాను మోహములే చల్లీని
వగకాఁడు అపుడిట్ల వచ్చెనటవే
తగిలి శ్రీవేంకటోత్తముఁడు నన్నిటు గూడె
వెగటుఁగూరిము లపుడు వెలయించెనా
(||pallavi||)
tānĕrum̐gu negadabu tanasem̐talu
yī nijamulĕlla mī yĕduḍanegāga
(||tānĕ||)
tappuledani maṁchidagavule sĕppīni
appuḍāḍimāḍa lāḍĕnaḍave
dappi momunam̐ dera dayalu vuṭṭiṁchīni
yippu ḍiṁdām̐kā dā niṭṭuṁḍĕnā
(||tānĕ||)
naḍuma nūraga isaḍa navvule navvīni
vuḍivoniyāsalamu lunnavaḍave
viḍuva kiḍu nāyĕduḍa vesālu sesīni
aḍari tanavoja ne nadi yĕṟam̐ganā
(||tānĕ||)
mŏgamoḍamunam̐ dānu mohamule sallīni
vagagām̐ḍu abuḍiṭla vachchĕnaḍave
tagili śhrīveṁkaḍottamum̐ḍu nanniḍu gūḍĕ
vĕgaḍum̐gūrimu labuḍu vĕlayiṁchĕnā