తానెంత నేనెంత తగుల నేమాడీనే
(॥పల్లవి॥)
తానెంత నేనెంత తగుల నేమాడీనే
తానకమయిన తన దయలోని దానవు
(॥తానెం॥)
కందువ నాచూపులు కడు వాఁడులంటాను
యిందరితో సారె నీతఁ డేమిచెప్పీనే
పొందైన నాకొప్ప గడుఁబొడవాయనంటాను
చెంది నన్ను నెంత రట్టు సేసీనే తాను
(॥తానెం॥)
కూరిమి నాచన్ను లివి కొండలఁబోలునంటా
వూరకే నన్నేమిటికి నుప్పతించీనే
గారవపు నామేను బంగారు చాయలదంటా
ఆరితేరి నాకెంత పచ్చారీనే తాను
(॥తానెం॥)
బలిమి నాపిఱుఁదులు బండికండ్లవంటి వంటా
పలుమారు నన్నేమి తప్పక చూచీనే
యెలమి శ్రీవెంకటేశుఁ డిందసేసి నన్నుఁగూడె
తలకొని యింకానెంత తమిరేఁచీనే
(||pallavi||)
tānĕṁta nenĕṁta tagula nemāḍīne
tānagamayina tana dayaloni dānavu
(||tānĕṁ||)
kaṁduva nāsūbulu kaḍu vām̐ḍulaṁṭānu
yiṁdarido sārĕ nīdam̐ ḍemisĕppīne
pŏṁdaina nāgŏppa gaḍum̐bŏḍavāyanaṁṭānu
sĕṁdi nannu nĕṁta raṭṭu sesīne tānu
(||tānĕṁ||)
kūrimi nāsannu livi kŏṁḍalam̐bolunaṁṭā
vūrage nannemiḍigi nuppadiṁchīne
gāravabu nāmenu baṁgāru sāyaladaṁṭā
ārideri nāgĕṁta pachchārīne tānu
(||tānĕṁ||)
balimi nābiṟum̐dulu baṁḍigaṁḍlavaṁṭi vaṁṭā
palumāru nannemi tappaga sūsīne
yĕlami śhrīvĕṁkaḍeśhum̐ ḍiṁdasesi nannum̐gūḍĕ
talagŏni yiṁkānĕṁta tamirem̐sīne