Taanela navvulu navvee damtalamu gaamanusu

తానేల నవ్వులు నవ్వీ దంటలము గామనుచు
Language

(॥పల్లవి॥)
తానేల నవ్వులు నవ్వీ దంటలము గామనుచు
పూని కొలువులో మీరఁబోలదని కాక

(॥తానే॥)
నేరరా పతితో నాడ నెలంతలు సరసాలు
ఆరయ మందెమేళ మౌననికాక
చేరి చెనకనోపరా చేతులు చాఁచి చాఁచి
సారెకుఁ దమసిగ్గులు జారీననికాక

(॥తానే॥)
జూటుఁదనాన పంతాలు చూపఁగనోపరా
ఆఁటదాని కోజలుగావనికాక
సూటిగాఁ గన్నులఁ జూచి సొలయఁగనోపరా
కాటుకవన్నెలకప్పు గప్పీననికాక

(॥తానే॥)
నెట్టనఁ దమకములు నెరపఁగనోపరా
గుట్టు బయలయ్యీనంటాం గొంకుటగాక
యిట్టె శ్రీవేంకటేశుఁ డే నలమేలుమంగను
చుట్టమై నన్నేలఁగా సోద్యమయ్యీఁగాక

(||pallavi||)
tānela navvulu navvī daṁṭalamu gāmanusu
pūni kŏluvulo mīram̐boladani kāga

(||tāne||)
nerarā padido nāḍa nĕlaṁtalu sarasālu
āraya maṁdĕmeḽa maunanigāga
seri sĕnaganobarā sedulu sām̐si sām̐si
sārĕgum̐ damasiggulu jārīnanigāga

(||tāne||)
jūḍum̐danāna paṁtālu sūbam̐ganobarā
ām̐ṭadāni kojalugāvanigāga
sūḍigām̐ gannulam̐ jūsi sŏlayam̐ganobarā
kāḍugavannĕlagappu gappīnanigāga

(||tāne||)
nĕṭṭanam̐ damagamulu nĕrabam̐ganobarā
guṭṭu bayalayyīnaṁṭāṁ gŏṁkuḍagāga
yiṭṭĕ śhrīveṁkaḍeśhum̐ ḍe nalamelumaṁganu
suṭṭamai nannelam̐gā sodyamayyīm̐gāga