Taanela dooreeni damtadaana namtaanu

తానేల దూరీని దంటదాన నంటాను
Language

(॥పల్లవి॥)
తానేల దూరీని దంటదాన నంటాను
మోనాన నుండితేను ముమ్మాటికి మొక్కనా

(॥తానే॥)
చలములు సారె సారె సాదించ వద్దు గాక
తలఁపుకొలఁది నుంటే తగదనేనా
బలిమిఁబెనఁగితేను పంతమాడుకొందుఁ గాక
పిలిచి లాచించితేను ప్రియములు చెప్పనా

(॥తానే॥)
ఆయములు ముట్టి ముట్టి అలఇంచవద్దు గాక
చాయసేసుక వుంటేను సమ్మతించనా
రాయడిఁ జన్ను లంటితే రవ్వగా జంకింతుఁగాక
నాయములు నడపితే ననుపుతో నవ్వనా

(॥తానే॥)
బాసలెల్లాఁ జేసి చేసి భ్రమయించవద్దు గాక
ఆసయిచ్చి కూడితేను అట్టే మెచ్చనా
సేసవెట్టి కూడినాఁడు శ్రీవేంకటేశ్వరుఁడు
వేసరక వుండితేను వేడుక చెల్లించనా

(||pallavi||)
tānela dūrīni daṁṭadāna naṁṭānu
monāna nuṁḍidenu mummāḍigi mŏkkanā

(||tāne||)
salamulu sārĕ sārĕ sādiṁcha vaddu gāga
talam̐pugŏlam̐di nuṁṭe tagadanenā
balimim̐bĕnam̐gidenu paṁtamāḍugŏṁdum̐ gāga
pilisi lāsiṁchidenu priyamulu sĕppanā

(||tāne||)
āyamulu muṭṭi muṭṭi ala̮iṁchavaddu gāga
sāyasesuga vuṁṭenu sammadiṁchanā
rāyaḍim̐ jannu laṁṭide ravvagā jaṁkiṁtum̐gāga
nāyamulu naḍabide nanubudo navvanā

(||tāne||)
bāsalĕllām̐ jesi sesi bhramayiṁchavaddu gāga
āsayichchi kūḍidenu aṭṭe mĕchchanā
sesavĕṭṭi kūḍinām̐ḍu śhrīveṁkaḍeśhvarum̐ḍu
vesaraga vuṁḍidenu veḍuga sĕlliṁchanā