Taane yeṟumgunu annidagavulu dayamdalamchee nibude ramanumdu

తానే యెఱుఁగును అన్నిదగవులు దయఁదలంచీ నిపుడె రమణుఁడు
Language

(॥పల్లవి॥)
తానే యెఱుఁగును అన్నిదగవులు దయఁదలంచీ నిపుడె రమణుఁడు
పూని యొకమాఁ టెచ్చరించవే పొసఁగు నోచెలియా

(॥తానే॥)
మచ్చికలుగలచోటి పొందులు మఱవలెటువలె వచ్చునే
ఇచ్చకముతోమెలఁగు సరసము లెరవు లే లగునే
వెచ్చువెరిగిన ననుపులెల్లను వెనలుగొనకే లుండునే
నచ్చుకొట్టక యిట్లనే విన్నసము సేయవే యతనికి

(॥తానే॥)
మరిగి పాయఁగరాని తగులమి మాననెటువలె వచ్చెనే
దొరసివుండినవయసు లేగతిఁ దొలఁగ దొబ్బేనే
సరవిగలవొడఁబాటుమాఁటలు చవులు రేఁచకవుండు నటవే
వెరవుతోడుత విన్నపము వేవేగఁ జేయవె యతనికి

(॥తానే॥)
తనివిదీరనిరతులసొంపులు తాళనెటువలె వచ్చునే
తనకుఁగా మీఁదెత్తుకుండినతమక మెటువలె దాఁతునే
యెనసె నను శ్రీవేంకటేశ్వరుఁ డిటకుఁ దానే వచ్చికరుణను
వినయమున నాసంతసంబులు విన్నవించవె యతనికి

(||pallavi||)
tāne yĕṟum̐gunu annidagavulu dayam̐dalaṁchī nibuḍĕ ramaṇum̐ḍu
pūni yŏgamām̐ ṭĕchchariṁchave pŏsam̐gu nosĕliyā

(||tāne||)
machchigalugalasoḍi pŏṁdulu maṟavalĕḍuvalĕ vachchune
ichchagamudomĕlam̐gu sarasamu lĕravu le lagune
vĕchchuvĕrigina nanubulĕllanu vĕnalugŏnage luṁḍune
nachchugŏṭṭaga yiṭlane vinnasamu seyave yadanigi

(||tāne||)
marigi pāyam̐garāni tagulami mānanĕḍuvalĕ vachchĕne
dŏrasivuṁḍinavayasu legadim̐ dŏlam̐ga dŏbbene
saravigalavŏḍam̐bāḍumām̐ṭalu savulu rem̐sagavuṁḍu naḍave
vĕravudoḍuda vinnabamu vevegam̐ jeyavĕ yadanigi

(||tāne||)
tanividīraniradulasŏṁpulu tāḽanĕḍuvalĕ vachchune
tanagum̐gā mīm̐dĕttuguṁḍinadamaga mĕḍuvalĕ dām̐tune
yĕnasĕ nanu śhrīveṁkaḍeśhvarum̐ ḍiḍagum̐ dāne vachchigaruṇanu
vinayamuna nāsaṁtasaṁbulu vinnaviṁchavĕ yadanigi