Taane yeṟumgunanave taravaadi panulellaa

తానే యెఱుఁగుననవే తరవాతి పనులెల్లా
Language

(॥పల్లవి॥)
తానే యెఱుఁగుననవే తరవాతి పనులెల్లా
నే నేమిచెప్పేఁ దనకు నేరిపేనా సుద్దులు

(॥తానే॥)
చిత్తములో తమకము చిమ్మిరేఁచఁగా
వొత్తియణఁచేనంటే నొద్దికయ్యీనా
గుత్తపుగుబ్బలు పైపై గొప్పలు గాఁగా(గా?)
బొత్తుగాఁ గొలఁదివెట్టి బుద్దిచెప్పవచ్చునా

(॥తానే॥)
కన్నులఁ జూచేయాసలు కదుమఁగాను
వన్నెలఁబట్ట నెఁ(నెం?) తైనా వనమయ్యీనా
తిన్నవివయసు తరితీపుసేయఁగా
వున్నతి నందులకు నూరకుండవచ్చునా

(॥తానే॥)
వీనుల విన్నవినికి వేగిరించఁగా
ఆనుకొన్న కోరికలు ఆఁపవచ్చునా
పూని యలమేల్ మంగవిభుఁడు శ్రీవేంకటేశుఁడు
మేనవానితో నన్నేలె మెచ్చకుండవచ్చునా

(||pallavi||)
tāne yĕṟum̐gunanave taravādi panulĕllā
ne nemisĕppem̐ danagu neribenā suddulu

(||tāne||)
sittamulo tamagamu simmirem̐sam̐gā
vŏttiyaṇam̐senaṁṭe nŏddigayyīnā
guttabugubbalu paibai gŏppalu gām̐gā(gā?)
bŏttugām̐ gŏlam̐divĕṭṭi buddisĕppavachchunā

(||tāne||)
kannulam̐ jūseyāsalu kadumam̐gānu
vannĕlam̐baṭṭa nĕm̐(nĕṁ?) tainā vanamayyīnā
tinnavivayasu taridībuseyam̐gā
vunnadi naṁdulagu nūraguṁḍavachchunā

(||tāne||)
vīnula vinnavinigi vegiriṁcham̐gā
ānugŏnna korigalu ām̐pavachchunā
pūni yalamel maṁgavibhum̐ḍu śhrīveṁkaḍeśhum̐ḍu
menavānido nannelĕ mĕchchaguṁḍavachchunā