తానే యెఱుఁగు విభుఁడు తన ఇచ్చలోదాన
(॥పల్లవి॥)
తానే యెఱుఁగు విభుఁడు తన ఇచ్చలోదాన
తానకముగా నన్ను దయఁజూడుమనవే
(॥తానే॥)
తలఁచితే వలపులు తామరదంపరలౌను
సొలసితే మాటలకుఁ జోటు గలుగు
వలెనంటే నాసలు వండవండనట్లవును
పలమారు నే విన్నపము సే సే దేమే
(॥తానే॥)
యెనసితే దమకము లీఁతలుమోఁతలునౌను
మనసు లేకములైతే మర్మము లంటు
అనువైతే చెనకులు అనలుఁగొనలుసాగు
పెనఁగిపెనఁగి తన్నుఁ బెరరేఁచే దేమే
(॥తానే॥)
కూడితే మొగమిచ్చలు కొండలుఁ గోటులునౌను
జోడువాయ కుండితేను సొంపు లెక్కును
యడ నన్నలమేల్మంగ నెనసె నింతటిలోనె
వోడక శ్రీవేంకటేశు నొరసే దేమే
(||pallavi||)
tāne yĕṟum̐gu vibhum̐ḍu tana ichchalodāna
tānagamugā nannu dayam̐jūḍumanave
(||tāne||)
talam̐side valabulu tāmaradaṁparalaunu
sŏlaside māḍalagum̐ joḍu galugu
valĕnaṁṭe nāsalu vaṁḍavaṁḍanaṭlavunu
palamāru ne vinnabamu se se deme
(||tāne||)
yĕnaside damagamu līm̐talumom̐talunaunu
manasu legamulaide marmamu laṁṭu
anuvaide sĕnagulu analum̐gŏnalusāgu
pĕnam̐gibĕnam̐gi tannum̐ bĕrarem̐se deme
(||tāne||)
kūḍide mŏgamichchalu kŏṁḍalum̐ goḍulunaunu
joḍuvāya kuṁḍidenu sŏṁpu lĕkkunu
yaḍa nannalamelmaṁga nĕnasĕ niṁtaḍilonĕ
voḍaga śhrīveṁkaḍeśhu nŏrase deme