Taane vachchi nannunelee dayadalamsi

తానే వచ్చి నన్నునేలీ దయదలఁచి
Language

(॥పల్లవి॥)
తానే వచ్చి నన్నునేలీ దయదలఁచి
కానుక చేతికియ్యరే కాంతలాల

(॥తానే॥)
మన్నించి వావులు చెప్పి మావారి నొడఁబరచి
కన్నెనాఁడే పెండ్లాడెఁ గాంతుఁడు దానె
నన్ను గడు మరిగించె నమ్మికమాటలాడి
విన్నవించరే యీసుద్ది వెలఁదలాల

(॥తానే॥)
ముచ్చటకుఁ జెలినంపి ముద్దుటుంగరము నిచ్చి
వచ్చి మాయింటికి నేంగీ వరుసఁ దానె
ఇచ్చెనాకు సొమ్ములెల్లా ఇవె నామేన నున్నవి
యెచ్చరించరే మీరు ఇంతులాల

(॥తానే॥)
మెలుపున నవ్వినవ్వి మెచ్చిమెచ్చి కాఁగిలింది
కలసె శ్రీవేంకటఘనుఁడు దానె
తిలకించి తొల్లె కూడె తెరమఱఁగిఁకనేల
తలఁపించరే మీరు తరుణులాల

(||pallavi||)
tāne vachchi nannunelī dayadalam̐si
kānuga sedigiyyare kāṁtalāla

(||tāne||)
manniṁchi vāvulu sĕppi māvāri nŏḍam̐barasi
kannĕnām̐ḍe pĕṁḍlāḍĕm̐ gāṁtum̐ḍu dānĕ
nannu gaḍu marigiṁchĕ nammigamāḍalāḍi
vinnaviṁchare yīsuddi vĕlam̐dalāla

(||tāne||)
muchchaḍagum̐ jĕlinaṁpi mudduḍuṁgaramu nichchi
vachchi māyiṁṭigi neṁgī varusam̐ dānĕ
ichchĕnāgu sŏmmulĕllā ivĕ nāmena nunnavi
yĕchchariṁchare mīru iṁtulāla

(||tāne||)
mĕlubuna navvinavvi mĕchchimĕchchi kām̐giliṁdi
kalasĕ śhrīveṁkaḍaghanum̐ḍu dānĕ
tilagiṁchi tŏllĕ kūḍĕ tĕramaṟam̐gim̐kanela
talam̐piṁchare mīru taruṇulāla