Taane vachcheemgaani tadavaguve padini

తానే వచ్చీఁగాని తడవకువే పతిని
Language

(॥పల్లవి॥)
తానే వచ్చీఁగాని తడవకువే పతిని
చేనంటి మునుపే నాకు సేస వెట్టినాఁడు

(॥తానే॥)
తలఁపులకొలఁదివే తగులాయాలు
వలచినకొలఁదివే వాడికలు
పిలుపులకొలఁదివే ప్రియములు
బలిమి సేయఁగఁ బోతే పచ్చిదేరుఁ బనులు

(॥తానే॥)
ఆడినకొలఁదివే యాస మాఁటలు
కూడినకొలఁదివే కూటములు
వేడుకకొలఁదివే వినోదాలు
వాడుకొనఁబోతేను వసగావు పనులు

(॥తానే॥)
ననిచినకొలఁదివే నగవులు
యెనసినకొలఁదివే యింపు సొంపులు
చెనకి నన్నేలినాఁడు శ్రీవేంకటేశుఁడు
పెనఁగఁగఁబోతేను పెచ్చురేఁగుఁ బనులు

(||pallavi||)
tāne vachchīm̐gāni taḍavaguve padini
senaṁṭi munube nāgu sesa vĕṭṭinām̐ḍu

(||tāne||)
talam̐pulagŏlam̐dive tagulāyālu
valasinagŏlam̐dive vāḍigalu
pilubulagŏlam̐dive priyamulu
balimi seyam̐gam̐ bode pachchiderum̐ banulu

(||tāne||)
āḍinagŏlam̐dive yāsa mām̐ṭalu
kūḍinagŏlam̐dive kūḍamulu
veḍugagŏlam̐dive vinodālu
vāḍugŏnam̐bodenu vasagāvu panulu

(||tāne||)
nanisinagŏlam̐dive nagavulu
yĕnasinagŏlam̐dive yiṁpu sŏṁpulu
sĕnagi nannelinām̐ḍu śhrīveṁkaḍeśhum̐ḍu
pĕnam̐gam̐gam̐bodenu pĕchchurem̐gum̐ banulu