తానే వచ్చీఁగాక తఱవాతి పనులెల్ల
(॥పల్లవి॥)
తానే వచ్చీఁగాక తఱవాతి పనులెల్ల
మోనాన నాడినమాట మోపులు గట్టెరా
(॥తానే॥)
చింతకొలఁదే మరి చెక్కిటఁబెట్టినచేయి
సంతోసముకొలఁదే సరి నవ్వులు
అంతేనేల దూరేరే ఆతఁడేమి సేసు నిఁక
కొంత కొంత మీరు బత్తి గొట్టానఁ బెట్టేరా
(॥తానే॥)
పెనఁగేటికొలఁదే ప్రేమపుచుట్టరికాలు
చనవులకొలఁదే సలిగెలును
మనసేమి చూచేరే మగవాఁడాతఁడు తొల్లే
తనిసినవలపులు దప్పికిఁ బోసేరా
(॥తానే॥)
ఆసలకొలఁదులో ఆయములు గరఁగేవి
సేసిన కొలఁదులే జిగిఁ బుణ్యాలు
యీసుదీర శ్రీ వేంకటేశుఁ డిట్టె నన్నుఁ గూడె
పోసరించినబుద్దులు పోరచివెట్టేరా
(||pallavi||)
tāne vachchīm̐gāga taṟavādi panulĕlla
monāna nāḍinamāḍa mobulu gaṭṭĕrā
(||tāne||)
siṁtagŏlam̐de mari sĕkkiḍam̐bĕṭṭinaseyi
saṁtosamugŏlam̐de sari navvulu
aṁtenela dūrere ādam̐ḍemi sesu nim̐ka
kŏṁta kŏṁta mīru batti gŏṭṭānam̐ bĕṭṭerā
(||tāne||)
pĕnam̐geḍigŏlam̐de premabusuṭṭarigālu
sanavulagŏlam̐de saligĕlunu
manasemi sūsere magavām̐ḍādam̐ḍu tŏlle
tanisinavalabulu dappigim̐ boserā
(||tāne||)
āsalagŏlam̐dulo āyamulu garam̐gevi
sesina kŏlam̐dule jigim̐ buṇyālu
yīsudīra śhrī veṁkaḍeśhum̐ ḍiṭṭĕ nannum̐ gūḍĕ
posariṁchinabuddulu porasivĕṭṭerā