Taane talamsugoni dayam jooseeni

తానే తలఁచుకొని దయఁ జూచీని
Language

(॥పల్లవి॥)
తానే తలఁచుకొని దయఁ జూచీని
ఆనించి కానుకలెల్లా నందియ్యరే

(॥తానే॥)
మాటతప్పేమిసేసీ మచ్చిగలితేఁ జాలు
పాటించి రమణుఁడే పంతమిచ్చీని
గాఁటాన నాతనినేల గాసిసేసేరే మీరు
చీటివాసి తనబాస చేతికియ్యరే

(॥తానే॥)
నడతప్పేమిసేసీ నమ్మి గలితేఁ జాలు
విడువ తానే వచ్చి వేఁడుకొనీని
వడిఁబెట్టి మీరేల వట్టిదూరులు దూరేరే
ముడెగట్టి తన నవ్వు ముంగిటనే పెట్టరే

(॥తానే॥)
తవనతప్పేమిసేసీ తానే కూడితేఁ జాలు
యివల శ్రీవేంకటేశుఁ డిట్టె యేలీని
తవిలి యీతనినేల తగవులఁ బెట్టేరే
జవకట్టి తనమేలు చాటి చెప్పరే

(||pallavi||)
tāne talam̐sugŏni dayam̐ jūsīni
āniṁchi kānugalĕllā naṁdiyyare

(||tāne||)
māḍadappemisesī machchigalidem̐ jālu
pāḍiṁchi ramaṇum̐ḍe paṁtamichchīni
gām̐ṭāna nādaninela gāsisesere mīru
sīḍivāsi tanabāsa sedigiyyare

(||tāne||)
naḍadappemisesī nammi galidem̐ jālu
viḍuva tāne vachchi vem̐ḍugŏnīni
vaḍim̐bĕṭṭi mīrela vaṭṭidūrulu dūrere
muḍĕgaṭṭi tana navvu muṁgiḍane pĕṭṭare

(||tāne||)
tavanadappemisesī tāne kūḍidem̐ jālu
yivala śhrīveṁkaḍeśhum̐ ḍiṭṭĕ yelīni
tavili yīdaninela tagavulam̐ bĕṭṭere
javagaṭṭi tanamelu sāḍi sĕppare