(॥పల్లవి॥)
తానే తడవిన తడవేఁగా కిఁక
రానీవే తతీ రఁ(రం?)తిఁకనేలా
(॥తానే॥)
నవ్వనిపతితో నవ్వఁగఁబోతే
యెవ్వరికైనా యింపౌనా
పువ్వులవాసన పూఁపల మొగ్గల
రవ్వగ వెదకిన రచనలఁ గలదా
(॥తానే॥)
పలుకనిపతితో పలుకఁగఁబోతే
చలమున మతికిని చవులౌనా
లలి నామనికాలపుకోవిలగమి
నలుగడ లెపుడైనాఁ బలికీనా
(॥తానే॥)
మోహపుపతితో మొరఁగు చూపితే
ఆహ వుచితము లవి యవునా
యీహల శ్రీవేంకటేశుఁడు గూడెను
వూహజక్కవల కుదయమెకాదా
(||pallavi||)
tāne taḍavina taḍavem̐gā kim̐ka
rānīve tadī ram̐(raṁ?)tim̐kanelā
(||tāne||)
navvanibadido navvam̐gam̐bode
yĕvvarigainā yiṁpaunā
puvvulavāsana pūm̐pala mŏggala
ravvaga vĕdagina rasanalam̐ galadā
(||tāne||)
paluganibadido palugam̐gam̐bode
salamuna madigini savulaunā
lali nāmanigālabugovilagami
nalugaḍa lĕbuḍainām̐ baligīnā
(||tāne||)
mohabubadido mŏram̐gu sūbide
āha vusidamu lavi yavunā
yīhala śhrīveṁkaḍeśhum̐ḍu gūḍĕnu
vūhajakkavala kudayamĕgādā