తానే నేనైనవాఁడు దాఁగవలెనా
(॥పల్లవి॥)
తానే నేనైనవాఁడు దాఁగవలెనా
కానుక వలపులతోఁ గాఁగిలించవలదా
(॥తానే॥)
యింత తమకించేవాఁడు యేఁటి కప్పు డలిగెనే
చెంతల నేఁజెప్పినట్టు సేయవలదా
పంత మిప్పు డిచ్చేవాఁడు పై కొనేల తిట్టీనే
సంతసపుసరసాల చన వియ్యవలదా
(॥తానే॥)
తగవు దప్పనివాఁడు తబ్బిబ్బు లాడనేలే
నగుతా నే నన్నమాఁట నమ్మవలదా
పొగడేటివాఁడు తనబోగపురాజసమేలే
అగడు మాని నాయంకెకు రావలదా
(॥తానే॥)
యిటు నన్నుఁ గూడేవాఁడు యీడనాడ నేలుండెనే
తటుకన తా నాకు దక్కవలదా
ఘటన శ్రీవేంకటాద్రి ఘనుఁడు నన్నిదె కూడె
సటలెల్లాఁ దీరి యింత సతముగావలదా
(||pallavi||)
tāne nenainavām̐ḍu dām̐gavalĕnā
kānuga valabuladom̐ gām̐giliṁchavaladā
(||tāne||)
yiṁta tamagiṁchevām̐ḍu yem̐ṭi kappu ḍaligĕne
sĕṁtala nem̐jĕppinaṭṭu seyavaladā
paṁta mippu ḍichchevām̐ḍu pai kŏnela tiṭṭīne
saṁtasabusarasāla sana viyyavaladā
(||tāne||)
tagavu dappanivām̐ḍu tabbibbu lāḍanele
nagudā ne nannamām̐ṭa nammavaladā
pŏgaḍeḍivām̐ḍu tanabogaburājasamele
agaḍu māni nāyaṁkĕgu rāvaladā
(||tāne||)
yiḍu nannum̐ gūḍevām̐ḍu yīḍanāḍa neluṁḍĕne
taḍugana tā nāgu dakkavaladā
ghaḍana śhrīveṁkaḍādri ghanum̐ḍu nannidĕ kūḍĕ
saḍalĕllām̐ dīri yiṁta sadamugāvaladā