Taane naameemdadam dolle dayagalamdu

తానే నామీఁదటఁ దొల్లె దయగలఁడు
Language

(॥పల్లవి॥)
తానే నామీఁదటఁ దొల్లె దయగలఁడు
కానిమ్మని వొడఁబడేఁ గపట మేఁటికే

(॥తానే॥)
బాఁటుదప్పే మావాఁడా తాను మఱవ నేననరే
యేఁటికి వానలు వెట్టీ యీంతలోననే
చాటిచెప్పీఁ దనడాగు చన్నుల పైననరే
కోటికిఁ బడగెత్తె కొసరనేమిటికే

(॥తానే॥)
మేలెంచనివాడా తాను మేకొంటిననరే
యీలాగునేల మొక్కీ ఇంతలోననే
వోలవేసీ నావేల నుంగర మీదెనరే
యీలాగుచనవులందు యెరవు లేమిటికే.

(॥తానే॥)
సిగ్గువడేవాఁడా తాను చెనకితి ననరే
యెగ్గులేకనన్నుఁ గూడె ఇంతలోననే
అగ్గమై శ్రీవేంకటేశుఁడల మేలుమంగ
అగ్గలమాయ వలపు అలయనేమిటికే

(||pallavi||)
tāne nāmīm̐daḍam̐ dŏllĕ dayagalam̐ḍu
kānimmani vŏḍam̐baḍem̐ gabaḍa mem̐ṭige

(||tāne||)
bām̐ṭudappe māvām̐ḍā tānu maṟava nenanare
yem̐ṭigi vānalu vĕṭṭī yīṁtalonane
sāḍisĕppīm̐ danaḍāgu sannula painanare
koḍigim̐ baḍagĕttĕ kŏsaranemiḍige

(||tāne||)
melĕṁchanivāḍā tānu megŏṁṭinanare
yīlāgunela mŏkkī iṁtalonane
volavesī nāvela nuṁgara mīdĕnare
yīlāgusanavulaṁdu yĕravu lemiḍige.

(||tāne||)
sigguvaḍevām̐ḍā tānu sĕnagidi nanare
yĕgguleganannum̐ gūḍĕ iṁtalonane
aggamai śhrīveṁkaḍeśhum̐ḍala melumaṁga
aggalamāya valabu alayanemiḍige