(॥పల్లవి॥)
తాపసు లడవి యేడ తరుణి యేడ
బాపు బాపు రామచంద్ర భావించి చూడుమా
(॥తాప॥)
సీతఁ బాసి బంగారు సీతఁ బెండ్లియాడితివి
ఆతలఁ బరస్త్రీల నంట వందురు
చేతులార ముత్తేలసేస వెట్టె నీకు ఆ-
చేతనుఁజెక్కు మోఁపి చింతించే కొరకా
(॥తాప॥)
వెంటనే భూమిజఁ బాసి వేరేభూమి చేకొంటి
జంటనే సత్యముగలజాణ వందురు
వింటివంక నీకు నాకె వేడుకఁ జేరి మరు-
వింటిబారిఁబడి యొంటి వేఁగేటికొరకా
(॥తాప॥)
కొడుకులవంకఁ బెండ్లికొడుకవై జానకి-
నడరి కమ్మరఁ బెండ్లియాడితివి
తొడిరి శ్రీ వేంకటాద్రిఁ దోడనె వావిలిపాట
కడఁగి రాముఁడవై కరుణించే కొరకా
(||pallavi||)
tābasu laḍavi yeḍa taruṇi yeḍa
bābu bābu rāmasaṁdra bhāviṁchi sūḍumā
(||tāba||)
sīdam̐ bāsi baṁgāru sīdam̐ bĕṁḍliyāḍidivi
ādalam̐ barastrīla naṁṭa vaṁduru
sedulāra muttelasesa vĕṭṭĕ nīgu ā-
sedanum̐jĕkku mom̐pi siṁtiṁche kŏragā
(||tāba||)
vĕṁṭane bhūmijam̐ bāsi verebhūmi segŏṁṭi
jaṁṭane satyamugalajāṇa vaṁduru
viṁṭivaṁka nīgu nāgĕ veḍugam̐ jeri maru-
viṁṭibārim̐baḍi yŏṁṭi vem̐geḍigŏragā
(||tāba||)
kŏḍugulavaṁkam̐ bĕṁḍligŏḍugavai jānagi-
naḍari kammaram̐ bĕṁḍliyāḍidivi
tŏḍiri śhrī veṁkaḍādrim̐ doḍanĕ vāvilibāḍa
kaḍam̐gi rāmum̐ḍavai karuṇiṁche kŏragā